Category జాతీయం

టిడిపిలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ

పసుపు కండువా కప్పి స్వాగతించిన చంద్రబాబు అంచలంచెలుగగా ఎదిగిన నేత కన్నా అని చంద్రబాబు కితాబు అమరావతి, ఫిబ్రవరి 23 : బిజెపిని వీడిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.…

బడ్జెట్‌లో కేటాయింపులు భవిష్యత్‌ ‌తరాలకు ఉజ్వల భవిష్యత్తు

గ్లోబల్‌ ‌గ్రీన్‌ ఎనర్జీ మార్కెట్‌లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో బడ్జెట్‌ది ప్రధాన పాత్ర ‘గ్రీన్‌ ‌గ్రోత్‌’‌పై బడ్జెట్‌ అనంతర వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 23 : హరిత వృద్ధి, శక్తి పరివర్తన కోసం భారతదేశం అనుసరివచే వ్యూహాలలో మూడు ప్రధాన స్తంభాలు ఉన్నాయని, అందులో మొదటిది పునరుత్పాదక శక్తి ఉత్పత్తిని…

ఇం‌టి భోజనం సర్వీస్‌ ‌చేయనున్న జోమాటో

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 23 : ఫుడ్‌-‌డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ ‌జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రెస్టారెంట్ల నుంచి పుడ్‌ ‌సరఫరా చేస్తున్న ఈ సంస్థ ఇక ఆఫీసులకు వెళుతున్న వారికి ఇంటి భోజనాలు అందించనుంది. ముంబైలో డబ్బావాలల పాత్రను పోషించనుంది. ఇక నుంచి ఎవరైనా తమింటి భోజనాన్ని పంపిస్తే వారికి కూడా అందించనుంది.…

అమెరికాలో మరోమారు మంచు తుఫాన్‌

న్యూయార్క్, ‌ఫిబ్రవరి 23 : అగ్ర రాజ్యం అమెరికా మరోసారి మంచు గుప్పిట్లో చిక్కుకుంది. అమెరికా పశ్చిమ తీరం నుంచి గ్రేట్‌ ‌లేక్స్ ‌వరకు భారీగా మంచు తుపాను కురుస్తుండటంతో..ఏకంగా 1500 విమానాలు రద్దు అయ్యాయి. పలు నివాసాలకు విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోయింది. గంటకు 55 నుంచి 70 కిలోటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే…

తమిళ నాడు మాజీ సిఎం పన్నీరు సెల్వంకు సుప్రీమ్‌ ‌కోర్టులో షాక్‌

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 23(ఆర్‌ఎన్‌ఎ) : ‌పన్నీరు సెల్వంకు సుప్రీంలో షాక్‌ ‌తగిలింది. ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడికే పళని స్వామి కొనసాగవచ్చునని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. గతంలో మద్రాస్‌ ‌హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో ఆ పార్టీ సీనియర్‌ ‌నేత ఓ పన్నీర్‌సెల్వంకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టులో…

హైదరాబాద్‌లో మొక్కలు నాటిన కంగనా

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 22 : బాలీవుడ్‌ ‌స్టార్‌ ‌హీరోయిన్‌ ‌కంగనా రనౌత్‌ ‌గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో మొక్కలు నాటారు. మొత్తం మూడు మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసారు.  కంగనా రనౌత్‌ ‌మొక్కలు నాటిన సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను.. గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టిన బీఆర్‌ఎస్‌…

గన్నవరం సబ్‌జైలుకు ఎపి టిడిపి నేత పట్టాభి

విజయవాడ, ఫిబ్రవరి 22 : టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్‌జైలు కు తరలించారు. పట్టాభిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ‌కేసులు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఉదయం గన్నవరం కోర్టుకు తీసుకువచ్చారు. సివిల్‌ ‌కోర్టు జడ్జి ఎదుట పట్టాభిని పోలీసులు హాజరుపర్చారు. పట్టాభికి సంబంధించిన మెడికల్‌ ‌రిపోర్టును…

సంసద్‌ ‌రత్న అవార్డులు-2023కు ఎంపికయిన ఎంపిలకు ప్రధాని అభినందన

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : సంసద్‌ ‌రత్న అవార్డులు-2023తో సన్మానితులు కానున్న తన తోటి ఎంపిలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలను తెలియ జేశారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోశి ట్వీట్‌ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ…‘‘సంసద్‌ ‌రత్న పురస్కారాలను అందుకోబోతున్న నా తోటి ఎంపిలకు ఇవే…

‌ప్రజలను చేరువ చేస్తుండడంతో పాటు దేశ ప్రగతికి తోడ్పడుతున్న విమానయాన రంగం : ప్రధాన మంత్రి

హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 22 : దేశీయంగా వాయు మార్గంలో ప్రయాణించినటువంటి వారి సంఖ్య 4.45 లక్షలకు చేరుకొన్న తరుణంలో, విమానాశ్రయాల సంఖ్య అధికం కావడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. కోవిడ్‌ అనంతర కాలంలో వాయు మార్గ ప్రయాణికుల సంఖ్యలో ఒక క్రొత్త పెరుగుదల నమోదు అయింది. ఈ సందర్భంగా పౌర విమాన…