Category జాతీయం

కూలిన అండర్‌ ‌బ్రిడ్జి రీలింగ్‌ ‌రాడ్‌

తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం బెంగళూరు, జూన్‌ 28 : ‌కర్ణాటక రాష్ట్రం హుబ్బలిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అండర్‌ ‌బ్రిడ్జ్ ‌వద్ద ఏర్పాటు చేసిన ఓ ఐరన్‌ ‌రాడ్‌  ఒక్కసారిగా రద్దీ రోడ్డుపై కూలింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనాలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. రైల్వే బ్రిడ్జి ముందు…

ఎన్సీపీ పోస్టర్లలో కానరాని అజిత్‌ ‌పవార్‌ ‌ఫోటో

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కనిపించిన దృశ్యం న్యూ దిల్లీ, జూన్‌ 28 : ‌నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్సీపీ కీలక సమావేశానికి సంబంధించిన పోస్టర్లలో ఆ పార్టీ సీనియర్‌ ‌నేత అజిత్‌ ‌పవార్‌  ‌ఫొటో మాయమైంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ ‌పవార్‌, ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్లు సుప్రియా సూలే, ప్రఫుల్‌ ‌పటేల్‌ ‌మాత్రమే పార్టీ పోస్టర్లలో ఉన్నారు.…

శత్రువులంతా ఒక్కటయ్యారు

ప్రతిపక్ష పార్టీల్లో భయం కనిపిస్తుంది ప్రతిపక్షాలను చూస్తే జాలేస్తుంది మధ్యప్రదేశ్‌ ‌పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ భోపాల్‌, ‌జూన్‌ 27 : 2014, 2019 ఎన్నికల్లో లేని భయం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపిస్తోందని, 2024లో బీజేపీకి ఓటేయాలనే ప్రజల సంక్షల్పాన్ని విపక్షాలు చూస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌ ‌పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన బీజేపీ…

పీవోకే భారత్‌లో కలుస్తానంటుంది

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌తరచూ అంతర్జాతీయ వేదికల మీద కశ్మీర్‌ అం‌శాన్ని ప్రస్తావిస్తూ తొండివాదనను వినిపించే పాకిస్తాన్‌ ‌కు తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌ ‌నాథ్‌ ‌సింగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ము వర్సిటీలో జరిగిన భద్రతా సదస్సుకు హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ ‌భారత్‌ ‌లో అంతర్భాగమని..…

దిల్లీ ఎయిర్‌ ‌పోర్టులో నకిలీ కస్టమ్స్ ఆఫీసర్లు

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌సౌదీ అరేబియా నుండి భారత్‌ ‌వచ్చిన 53 ఏళ్ల మహమ్మద్‌ ‌సులేమాన్‌ ‌ను కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి ఇద్దరు ఆగంతకులు అతను కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తాన్ని దోచుకుని నడిరోడ్డుపై వదిలేశారు. దిక్కుతోచని స్థితిలో సులేమాన్‌ ‌ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌ ‌ప్రకారం..…

గ్యాంగ్‌స్టర్‌ ‌హత్యపై సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయించిన అతిక్‌ అహ్మద్‌ ‌సోదరి

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌గ్యాంగ్‌స్టర్‌ ‌నుంచి రాజకీయవేత్తగా మారిన అతిక్‌ అహ్మద్‌ ‌సోదరి తన ఇద్దరు సోదరులు, మేనల్లుడి మరణానికి ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులపై బాధ్యత వహించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయేషా నూరి తరఫు న్యాయవాదులు సోమేష్‌ ‌చంద్ర ఝా, అమర్త్య ఎ. శరణ్‌ అతిక్‌ ‌హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని…

దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో 24 గంటల వ్యవధిలో 115.5 మిల్లీమీటర్లకు మించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని…

డబుల్‌ ఇం‌జిన్‌ ‌తుడిచిపెట్టుకు పోతుంది

మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు కోల్‌కతా, జూన్‌ 26 : ‌భారతీయ జనతాపార్టీ దేశాన్ని అమ్మాలనుకుంటోందని పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత్రి మమతాబెనర్జి విమర్శించారు. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ యూనిట్లలో వాటాలను బీజేపీ సర్కారు అమ్మేసిందని ఆరోపించారు. ఇవాళ కూచ్‌ ‌బెహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. ’బీజేపీ…

యూపీలో ట్రాక్టర్‌ ‌ట్రాలీని ఢీకొని పట్టాలు తప్పిన గూడ్స్

‌లక్నో, జూన్‌ 24 : ఒక గూడ్స్ ‌రైలు  ట్రాక్టర్‌ ‌ట్రాలీని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ ‌ట్రాలీలో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున బన్సీ పహర్‌పూర్‌ – ‌రుబ్బాస్‌ ‌ప్రాంతంలోని రైలు గేటు వద్ద ట్రాలీ ఉన్న ట్రాక్టర్‌ ‌పట్టాలు దాటేందుకు…