Category ఎడిటోరియల్

మాల్స్‌లో పనిచేస్తున్న వారూ మనుషులే…!!!

ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలలో మాత్రమే కనిపించిన మాల్స్‌, మార్ట్స్‌ ఇప్పుడు ప్రతీ పట్టణాలలో దర్శనమిస్తున్నాయి. ఇవి ఎక్కువగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్‌ మరియు గృహోపకరణాలు, జ్యులరీ రంగాలలో ఉంటున్నాయి. వీటివలన ఎంతో మంది యువతకు ఉపాధి కలిగించడం చాలా ఆనందించదగ్గ విషయమే. వెళ్ళగానే గ్లాస్‌ తలుపులు తీసి ఆహ్వానించే వారినుండి సేల్స్మెన్‌ వరకూ నవ్వుతూ మనకు…

ప్రతిష్టాత్మకం… భారతరత్న పురస్కారం

భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. భారతరత్న పురస్కారం అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి/చేసిన సేవకు గుర్తింపుగా ఎటువంటి జాతి, వృత్తి, స్థాయి, లింగ బేధాలను పాటించకుండా ప్రదానం చేయబడుతుంది. పురస్కారానికి ఎంపిక చేయాల్సిన జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి…

నూతన సంవత్సరంలో తెలంగాణకు కొత్త కాంతులు

2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో..వోటుకు నోటు కేసులో అరెస్ట్‌ కావటంతో రేవంత్‌ రెడ్డి తెలంగాణలో ఓ సంచలనంగా మారిపోయారు. అయితే..రేవంత్‌ ఏమాత్రం భయపడకుండా..ఇదంతా కేసీఆర్‌ అండ్‌ కో పన్నిన కుట్రగా తిప్పికొట్టారు. ఆ సమయంలోనే..కేసీఆర్‌ను సీఎం కుర్చీ నుంచి దించుతానని మీసం తిప్పి మరీ శపథం చేశారు. తన కూతురి పెళ్లికి కూడా ఆయన ఓ…

రాహుల్‌ న్యాయయాత్ర బిజెపి విజయపరంపరను అడ్డుకోగలదా?

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండవ విడుతగా చేపట్టిన ‘భారత్‌ న్యాయ యాత్ర’ కాంగ్రెస్‌ కష్టాలను గట్టెక్కిస్తుందా, ఆ పార్టీని అధికారంలోకి తీసుకువొస్తుం దా అన్న విషయంపైనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చజరుగుతున్నది. ఇంతకు క్రితం రాహుల్‌ గాందీ చేపట్టినó ‘భారత్‌ జోడో యాత్ర’ రాజకీయంగా ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదన్న వాదన కూడా లేకపోలేదు.…

గత అనుభవాలు…భవిష్యత్తుకు మార్గ నిర్దేశకాలు!

కాలచక్ర పరిభ్రమణంలో ఎన్నో సంవత్సరాలు గతించాయి. క్యాలెండర్లు మారుతున్నా కాలం మాత్రం ఆగదు. తరాలు గతిస్తున్నా మానవుల మధ్య  వైరుధ్యాలు, వైషమ్యాలు సమసి పోవడం లేదు. కాలవాహినిలో కలిసిపోయే ప్రతీ సంవత్సరం ఎన్నో అనుభవాలను మనకు గురుతుగా మిగిల్చి, మరో సంవత్సరానికి దారిచూపిస్తూ, తాను వీడ్కోలు గైకొంటూ, నూతన సంవత్సరానికి స్వాగత గీతిక పలుకుతూ నిష్క్రమించడం…

ప్రజాపాలన దరఖాస్తులతో దశతిరిగేనా..?

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల వాగ్దానాలతో ప్రజలను మెప్పించి,  అధికారం కైవసం చేసుకుంది.  దానికి అనుగుణంగానే శరవేగంగా ప్రభుత్వం ఏర్పడిన మూన్నాళ్ళకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,  రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో  పది లక్షల వరకు ఉచిత వైద్యం అమలుకు నిర్ణయం తీసుకున్నారు.  ఎప్పుడు ఎలాంటి విధి విధానాలను ప్రకటించకుండా ప్రజా పాలన దరఖాస్తులను…

సామాన్యునికి కలిసిరాని 2023..!

2023 సంవత్సరానికి ఈ రోజు ఆఖరి రోజు ..   చంద్రమండలం పై త్రివర్ణ పతాకం రెపరెప లాడడం మినహా ..దేశంలో  పెద్దగా మాయలు, మంత్రాలు జరగలేదు … యధారాజా తథా ప్రజా అన్నచందంగా సాగింది. దేశం పెద్దగా ఏ రంగంలోనూ అభివృద్దిని చూడలేదు. అయితే ధరలదాడి ఈ యేడాది కూడా సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేసింది.…

ఉద్యోగ రంగంలో అన్యాయాలపై సుదీర్ఘ పోరాటాలు

నేడు  610 జీవో  జారీ అయిన రోజు తెలంగాణ ప్రాంతీయులకు ఉద్యోగ రంగంలో దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని సవరించి చక్క దిద్దేందుకు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌  610 జీ.వో   జారీ చేసిన రోజు డిసెంబర్‌ 30.. తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయం ఏమిటి? అది ఎలా జరిగింది? సవరింపులు, చక్కదిద్దడాలు జరిగాయా? ముల్కి నిబంధనలు,…

మహిళల్లో మద్యసేవన అలవాటు పెరుగుతోందా…!

నేటి ఆధునిక డిజిటల్‌ యుగపు మహిళలు క్రమంగా మద్యానికి దగ్గరవుతున్నారని, స్త్రీ పురుషుల మద్య సేవన అసమానతలు క్రమంగా తగ్గుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజు వారి ఒత్తిడిని తట్టుకోవడం, పనిలో అలసిపోవడం, అరుదుగా లభించే సంతోష క్షణాలను ఆస్వాదించడం, కుటుంబ సమస్యలు, గృహ వేధింపులు లాంటి కారణాలతో మహిళలు ఆల్కహాల్‌ వైపుకు ఆకర్షితులవుతున్నట్లు విశ్లేషించారు.…