Category Crime

రోడ్డు ప్రమాదంలో తండా యువకుడి దుర్మరణం

– కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు ఇనుగుర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. చేతికి వచ్చిన పెద్ద కొడుకు అండగా ఉంటాడని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు విధి తీరని అన్యాయం చేసింది. ఉపాధి కోసం నగరం వచ్చిన ఆ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లో…

ఫోన్‌ ‌బ్లాక్‌ ‌చేయడంపై ఆగ్రహం

– ప్రియుడిని కిరాతకంగా చంపిన ప్రియురాలు రాయపూర్‌, ఫిబ్రవరి 4:  ప్రియుడు తన ఫోన్‌ ‌నెంబర్‌ ‌బ్లాక్‌ ‌చేశాడన్న కోపంతో ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడిని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసింది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బిలాస్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల కమ్తా…

మరణ శాసనం రాసిన కొరియన్‌ ‌గేమ్‌

– ఆన్‌లైన్‌ ‌గేమ్‌కు బానిసలై అక్కాచెల్లెళ్ల బలవన్మరణం లక్నో, ఫిబ్రవరి 4: ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌ ‌కొరియన్‌ ‌గేమ్‌ ‌ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసింది. ఆన్‌లైన్‌ ‌గేమ్‌ ఆడవద్దని తల్లిదండ్రులు మందలించటంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 2.30 గంటల…

రూ.15 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జోన్ ఎస్‌ఈ

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి4: ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం పడింది. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్ ఎస్‌ఈ చిన్నారెడ్డి రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారు. దీంతో జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టి రికార్డులు పరిశీలిస్తున్నారు. చిన్నారెడ్డి ఆస్తులు, ఇతర అంశాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. బిల్లులు మంజూరు…

మొగిలిపేటలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

– నలుగురు మహిళా కూలీల దుర్మరణం జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 3 జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం రాత్రి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఈ…

బైక్‌పై పడ్డ జేసీబీ

– బాలుడు దుర్మరణం వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2: వికారాబాద్‌ ‌జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జేసీబీని తీసుకెళుతున్న ట్రక్కు బైక్‌పై బోల్తాపడిన ఘటనలో ఓ బాలుడు మరణించాడు. బాలుడి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ధారూరు మండలం కొండాపూర్‌ ‌కలాన్‌ ‌నుంచి 8 ఏళ్ల రిత్విక్‌ ‌తన తండ్రి లాలయ్యతో కలిసి బైక్‌పై వికారాబాద్‌ ‌వెళుతున్నాడు.…

సర్పంచ్‌ ఎన్నిక కోసం కన్నకూతురు బలి

– ముగ్గురు సంతానం నిబంధనతో ఒకరిని చంపేసిన తండ్రి – హత్యను ఛేదించిన నిజామాబాద్‌ ‌పోలీసులు నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2:: పంచాయితీ ఎన్నికల కోసం ఓ తండ్రి కన్నకూతురునే బలితీసుకున్నాడు.కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రి తన స్వార్థం కోసం అభం శుభం తెలియని ఆరేళ్ల కూతురిని హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది.…

రేబిస్‌ ‌వ్యాక్సిన్‌ ‌వికటించి బాలిక‌ మృతి

– విచారణ చేపడతామన్న ఆర్‌ఎం‌వో కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి2: యాంటీ రేబిస్‌ ‌వ్యాక్సిన్‌ ‌వికటించి చిన్నారి మృతిచెందిన సంఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది.  చిన్నారి మృతి ఘటనపై విచారణ చేపడతామని ఆర్‌ఎం‌వో సంతోష్‌ ‌తెలిపారు. ఉదయం 11.30 గంటలకు దవాఖాన నుంచి బయటికి వెళ్లారని, ప్రైవేట్‌ ‌దవాఖానకు సుమారు 2.30 గంటలకు వెళ్లారని, ఈ మధ్యలో ఏమి…

రైలు కిందపడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య

-హైదరాబాద్ లో విషాదం – చర్లపల్లి–ఘట్కేసర్ మధ్య మృతదేహాల గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31 : హై దరాబాద్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చర్లపల్లి– ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున సుమారు…