Category ముఖ్యాంశాలు

గెలుపే లక్ష్యంగా ఆగస్టు నుంచి బిజెపి పాదయాత్రలు

చేయనున్న కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటల ఈటల, ధర్మపురిలకు కేంద్రం అదనపు భద్రత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఆగస్టు నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్రలు చేయాలని కాషాయనేతలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఎం‌పీ బండి సంజయ్‌…

అవసరమైతే సీతక్కను సీఎంను చేస్తాం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. తానా సభల్లో రేవంత్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్ద పీట వేస్తామన్నారు. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామని రేవంత్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారం…

పోడుకు పట్టం కట్టి గిరిజనులను రాజులను చేసాం

ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించిన ఘనత కెసిఆర్‌ ‌ది 1127 మందికి  పోడు పట్టాలు పంపిణీ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 10 : పోడుకు పట్టం కట్టి గిరిజనులను రాజులను చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య…

ఉపాధ్యాయ దంపతుల ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్‌

స్పౌజ్‌ ‌బదిలీల కోసం నినదించిన ఉపాధ్యాయులు బోనాలు సమర్పించిన మహిళా టీచర్లు మిగిలింది ప్రగతి భవన్‌ ‌ముట్టడేనని సంఘాలు వెల్లడి ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : ఉపాధ్యాయ దంపతుల బదిలీలు కోసం ధర్నా చౌక్‌లో నిర్వహించిన ఆవేదన సభ స్పౌజ్‌ ‌బదిలీలు జరపండనే నినాదాలతో దద్దరిల్లింది. 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు…

శివసేన వర్గాలకు స్పీకర్‌ ‌నోటీసులు

ముంబై, జూలై 8 : మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ ‌రాహుల్‌ ‌నర్వేకర్‌ ‌విచ్ఛిన్న శివసేన పార్టీకి చెందిన రెండు వర్గాల ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేశారు. ’పై ఎందుకు అనర్హత వేటు వేయకూడదు’ అని ఎమ్మెల్యేలకు పంపిన నోటీసులలో స్పీకర్‌ ‌ప్రశ్నించారు. తాను జారీచేసిన నోటీసులకు వివరణ ఇవ్వాలని రెండు వర్గాల ఎమ్మెల్యేలను ఆదేశించారు. గతంలో శివసేనను…

వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి… జయంతి సందర్భంగా వైఎస్‌కు ఇడుపులపాయలో తల్లితో కలసి షర్మిల నివాళి

ఇడుపులపాయ, జూలై 8 : వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్‌ ‌తనయ వైఎస్‌  ‌షర్మిల శనివారం ఉదయం నివాళి అర్పించారు. ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె వెంట తల్లి విజయ, కుమారుడు రాజారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రత్యేక…

ఎన్విరాన్ మెంటల్ సైన్స్ లో శృతి దేవులపల్లి కి డాక్టరేట్

హైదరాబాద్ కు చెందిన శ్రుతి దేవులపల్లికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఎన్విరాన్ మెంటల్ సైన్స్ లో పిహెచ్ డి డిగ్రీని ప్రదానం చేసింది. ఆమె ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ నొవార్టిస్ లో సీనియర్ అసోసియేట్ గా పనిచేస్తున్నారు. “హైదరాబాద్ లో కోవిడ్ కు ముందు, కోవిడ్ లాక్ డౌన్ సమయంలోనూ, కోవిడ్ అనంతరం…

మోదీ సభలో సిఎం పాల్గొనకపోవడంపై ఆగ్రహించిన కిషన్‌రెడ్డి

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆహ్వానించినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనక పోవడం పట్ల కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీస మర్యాదను కూడా పాటించడం లేదని ఆయన విరుచుకు పడ్డారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌హాజరు కాకపోవడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. 29 సంవత్సరాల…

వరంగల్‌కు వొచ్చిన నాల్గవ ప్రధాని

దేశ చరిత్రలో వరంగల్‌కు ప్రత్యేక స్థానం ఉన్నది. సాహిత్య ఆధ్యాత్మికతకు ఇక్కడ ఎంత పేరుందో, పౌరుషానికి ఇది పెట్టింది పేరు. చరిత్రలో అనేక ఉద్యమాలకు వరంగల్‌ ‌ముందు వరుసలో నిలుస్తూ వొచ్చింది. అలాంటి నగరానికి ఇప్పటివరకు నలుగురు ప్రధానులు రావడం విశేషం. భారత తొలి ప్రధాని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ రెండు పర్యాయాలు ఈ చారిత్రక…