Category ముఖ్యాంశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

– బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ‘సిట్‌’ నోటీసులు – రేపు మధ్యాహ్నం విచారణ చేపడతామని వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ‘సిట్‌’ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్‌లోని ఆయన నివాసానికి గురువారం వెళ్లి…

జాతీయ పండుగగా గుర్తించాల‌ని కోరాం

– కేంద్ర మంత్రుల రాకతో కల సాకారమవుతుందని ఆశ – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న రెండో సమ్మక్క-సారక్క జాతర ఇదేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తుల సౌకర్యార్థం అనేక శాశ్వత అభివృద్ధి…

సారలమ్మ రాకతో పోటెత్తిన భక్తజనం

– మంత్రులు సీతక్క, అడ్లూరి, జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం బుధవారం అర్ధ‌రాత్రి భక్తి పార‌వశ్య వాతావరణంలో ఆవిష్కృతమైంది. కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా కన్నెపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మ కొలువు తీరింది. ఈ ఘట్టానికి ముందుగా…

మహా జాతరలో నేడు కీలక ఘట్టం

– వనం నుండి జనంలోకి రానున్న సమ్మక్క – కుంకుమ భరిణ రూపంలో మేడారం గద్దెలపైకి – మూడంచెల భద్రత మధ్య ఆగమనం – గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరపనున్న జిల్లా ఎస్పీ మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: మేడారం మహా జాతరలో గురువారం సాయంత్రం మహా ఘట్టం ఆవిష్కృతం కానుంది. వ‌నంలో ఉన్న‌…

బైక్‌పై మంత్రులు పొంగులేటి, అడ్లూరి ప‌ర్య‌వేక్ష‌ణ‌

మేడారం, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 29ః ఈసారి మేడారం మ‌హా జాత‌ర‌లో మంత్రుల‌ అట్టహాసాలు.. హంగులు లేవు.. కాన్వాయ్‌ల ఆర్భాటాలు లేవు.. జనం మధ్యకు వెళ్లాలనే తపన.. భక్తుల కష్టాలు స్వయంగా చూడాలనే సంకల్పం. అదే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారం పర్యటన. గురువారం తెల్ల‌వారు జాము నుంచి కార్య‌క్షేత్రంలోకి దిగి అంద‌రినీ ఆశ్చర్య ప‌రిచారు. మొన్నటి…

సమ్మక్క-సారక్క జాతర గిరిజనుల మహా కుంభ్‌

– కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం – ఓరంతో క‌లిసి త‌ల్లుల‌ను ద‌ర్శించుకున్న కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి – కేంద్ర మంత్రుల‌కు రాష్ట్ర మంత్రుల స్వాగ‌తం మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: మేడారం సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి…

 పకడ్బందీగా కొనసాగుతున్న మహా జాతర

– అవసరమైన వారికి తగిన వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు – అధికారులతో జాతరను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి – కుటుంబంతో క‌లిసి అమ్మ‌ల ద‌ర్శ‌నం మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర పకడ్బందీగా కొనసాగుతున్నది. సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణను ప్రభుత్వం ఎప్పటికప్పుడు…

సుప్రీం ఆదేశాలతో ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ

– ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్‌కు నోటీసు జారీ – 30న హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణలో వేగం పెంచారు. ఇందుకు సంబంధించి తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేశారు.…

మేడారం జాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతం

– కొద్దిసేపట్లో గద్దెకు సారలమ్మ రాక – కన్నెపల్లిలో పూజలో పాల్గొన్న మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28: కన్నెపల్లి గ్రామం నుంచి మేడారంలోని గద్దెకు వనదేవత సారలమ్మ బయలుదేరింది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాల నడుమ సారలమ్మకు అడుగడుగునా భక్తులు నీరాజనం పట్టారు. కన్నెపల్లిలో పూజారులు జరిపిన సారలమ్మ ప్రత్యేక పూజల్లో మంత్రి…