Category శీర్షికలు

భారత కార్మికోద్యమ పితామహులు

“భారతదేశంలో కార్మికుల కోసం స్థాపించబడిన మొదటి ట్రేడ్ యూనియన్ ఇది. దీని ద్వారా లోఖండే మరియు ఆయన మిత్రులు మిల్లు కార్మికులను ఏకం చేశారు. 1884లో వేలాది మంది కార్మికులతో బొంబాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించి, బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక డిమాండ్ పత్రాన్ని సమర్పించారు.”   ఫూలే, లోఖండే మరియు సత్యశోధక సమాజ్ పోరాటం ప్రపంచవ్యాప్తంగా…

పొద్దుపొడుపై

నిన్నటివరకు తలెత్తి నిలిచిన మనిషి రాజ్యాలు నేడు తలవంచి తలలేని దేహాలై మిగిలి పోయాయెందుకో నేల పొరల్లో దాగిన విత్తనం భూమిని చీల్చుకుంటూ అడ్డుగా నిలిచిన మట్టిని తొలుస్తూ అంకురమై నిటారుగా విజయగర్వంతో తలెత్తటం ప్రకృతి సహజధర్మం స్వేచ్ఛగా నీలాకాశంలో రెక్కలల్లార్చుకుంటూ ఆకాశమే హద్దుగా ఎగిరే విహంగాలను రాకాసి గద్దలు అన్యాయంగా రెక్కల్ని తుంచేస్తూ కబళిస్తుంటే…

నిశ్శబ్దంలో నిక్షిప్తమైన విశ్వం

చెమ్మ :  వారాల ఆనంద్ తెలంగాణ కవిత్వమంటే ఒకప్రాంతపు కవిత్వం మాత్రమేకాదు అది ఒకసమాజపు చరిత్ర, పోరాటం, అస్తిత్వాన్వేషణ. ఇక్కడి కవిత్వం మట్టివాసనతో, సామాజిక చైతన్యంతో, భావోద్వేగ గాఢతతో ప్రత్యేకంగా ధ్వనిస్తుంది. ప్రధానంగా తెలంగాణ కవిత్వం పోరాటస్వరంతో గుర్తించబడుతుంది. ప్రాంతీయ అసమానతలు, దోపిడీ, అన్యాయాలపై ఈ కవిత్వస్వరం పలుకుతుంది. ఇక్కడ కవిత నినాదంగా, ఆయుధంగా మారింది. ఇదే ప్రధానస్వరూపం. ప్రాంతీయ అస్తిత్వం మరో కీలకలక్షణం.…

చింతల చేను చింత తీరింది – 2

(గత సంచిక తరువాయి భాగం) బండికి పిలుపులు రావటం మొదలైన వెంటనే తొలుత వచ్చినవాడు ఏలుమలై. అతని పొలంలో మూడుగంటలు పనిచేసినందుకు గుణశేఖరుడికి మూడువేలు ఇచ్చాడు. ఎంతో సంబరపడ్డాడు గుణశేఖరుడు. అంతలోనే వచ్చాడు పుట్టారెడ్డి. తానే ఎలుమలైకి చెప్పటం వలన, గుణశేఖరుడికి మూడువేలు వచ్చాయని, దానికిగాను పదిశాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బులు పట్టుకెళ్తాడు…

అంబేడ్కర్ ..ఓ హక్కుల పాలపుంత

తానో హక్కుల పాలపుంత ఎన్నెన్నో హక్కుల చుక్కలను ఒక్కకాడ పోగేసి కడగొట్టు ప్రజల జీవితాలు స్వయం ప్రకాశం చేసినోడు ఈ లోకమంతా ఆదిపత్యపు గుహలో చిక్కుకున్నపుడు హక్కుల దివిటీ పట్టి బయటకి తెచ్చిన మార్గదర్శకుడు వీడు ఈ లోకమిప్పుడు వాడు గీసిన గీతమీదనే నడుస్తుంది తెల్లారితే వాడి నామంతోనే ఈ దేశానికి పొద్దుపొడుస్తుంది తాను తాకితేనే…

సమతూకం

మెరుపు తీగెలు “నువ్వు తాగున్నావ్, తెలుసా?” “తెలుసు…” “తప్పు కదా?” “తప్పా? నేనేమీ రోడ్డుమీద బండి నడపడంలేదు కదా?” “తాగి యిలా వస్తారా యెవరైనా?” “రావడానికే తాగించారు, లేకపోతే నేనెందుకు వస్తాను” “హు…” “ఎంకరేజ్‌మెంటు… ప్రోత్సాహం…” “లేదు, వెళ్ళు…” “అలాగని రాసివ్వండి” “వాట్?” “తాగి వోటు వెయ్యకూడదని రాజ్యాంగంలో యెక్కడ రాసుందో చెప్పండి” “………” “మందుకొట్టే…

మూడు పంక్తుల కవిత్వం

ఇల్లు లేకపోతేనేం చాలామంది హృదయాల్లో చోటుంది నాకు * వానై కురిస్తేనే నీలోని మలినాల్ని కడిగేసుకోగలవు * పిల్లకాలువకో కొత్త పాట నేర్పెళ్లింది వాన * అద్దాలవోణీ నన్నణువణువులో నింపేసుకుంది * నా ఈ సిరా చుక్కలన్నీ మా అమ్మానాన్నల చెమట చుక్కలే -చిత్తలూరి

నేను రాసేది కవిత్వం కాదు

నాకు చాలా దెబ్బలు తగిలాయి నేను ఓడిపోలేదు అందరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు నా దారిని నేను వదిలిపెట్టలేదు ఒంటరిగా వున్నప్పుడు మనసు భరించలేని నొప్పివేస్తుంది కన్నీళ్లు మాత్రం రాలడం లేదు గుండె ఎండిపోయిందా అన్నిటినీ తట్టుకొని గట్టిపడిందా నాకు నీడగా, తోడుగా నడిచే బాధ, నన్ను వొంటరి చేసి వెళ్లిపోయిందా స్వప్నాలు ఏమైనాయో…

జిలానీ బానో జ్ఞాపకాల తిజోరీ

చెమ్మ  : వారాల ఆనంద్ జిలానీ బానో రాసిన ‘తెరిచిన పుస్తకం’  గొప్ప అనుభావాల ఇంద్రధనుస్సు . ఇవి కేవలం ఆమె వ్యక్తిగత అనుభవాలే కాదు ఒక కాలంలో ఒక ప్రాంతంలో ఒక తరం గడిపిన జీవితాల చిత్రణ. ఇప్పటికీ చాలా మందికి తెలీని చాలా గొప్ప హైదరాబాదీ  దక్కన్ సంస్కృతిని ఈ చిన్న పుస్తకంలో జిలానీ బానో ఆవిష్కరించింది.…