Category శీర్షికలు

నేనెవరు ?

నేనెవరు ? అనాదిగా నన్ను వేధిస్తున్న.. ఓ జటిల ప్రశ్న.. నా చుట్టపక్కాల కబుర్లెన్నో తెలుసు బంధువుల పుట్టుపూర్వోత్తరాలు మిత్రుల మతలబులు మర్మాలు ఎదుటోళ్ల లోప బలహీనతలు అక్కరకురానివన్నీ తెలిసిన (అ)జ్ఞానిని అందరి లోతులు, లొసుగులు చూశా వారిని చూసి పాలబడి నవ్వుకున్నా ! ఎవరి వీపు వారికి తెలియదు నా బలహీనతలు నాకు అక్కర్లేదు…

ప్రైవేట్‌, ‌కార్పొరేట్‌ ‌దవాఖానాల దోపిడీతో… తడిసి మోపెడవుతున్న వైద్య భారం

మనిషి అనారోగ్యం పాలైతే స్వస్థత చేకూర్చే వైద్య చికిత్సలో వైద్యుల, ఔషధాల, దవాఖానాల, ల్యాబుల పాత్ర చాలా విలువైంది. అందుకే వైద్యులను కనిపించే దైవంగా గౌరవించడం జరుగుతున్నది. ఇలాంటి వైద్యరంగంలోని తాజా స్థితి గతులను పరిశీలిస్తే..సేవ కన్నా ధనార్జనే ధ్యేయం  కావడం, ప్రభుత్వాల పర్యవేక్షణ లేమి మూలంగా ప్రజలు దాచుకున్న సొమ్ము దవాఖానాల పాలవుతుంది. నిబంధనలు…

అణువణువునా ఆవరించిన అవినీతి

నేడు అవినీతి లేని రాజ్యం, అక్రమార్కుల్లేని వ్యవస్థలపై మనం కలలు కనడం దుస్సాహసమే. ఓ అధికారి నుంచి బంట్రోతు దాకా ఈ దుష్క•తానికి అతీతులు కాకపోవడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అవినీతి, అక్రమాలపై జనం ఎంతో ఆసక్తిగా వింటారు… కంటారు. మామూలు వార్తల కన్నా ఈ వార్తలకే ర్యాంకింగ్‌లు, ప్రియారిటీలు లభిస్తాయంటే అతిశయోక్తి కాదు.…

వ్యవసాయ భూములను పరిరక్షించుకోవాలి

మనది వ్యవసాయక దేశం. జనాభాలో అత్యధిక శాతం  వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. జరుపుకునే పండుగలు పబ్బాలు వ్యవసాయంతోనే ముడిపడి ఉంటాయి. గతంలో వ్యవసాయ భూమితో సంఘంలో గౌరవ మర్యాదలు దొరికేవి అంటే వ్యవసాయ భూమికి అంత ప్రాధాన్యత ఉండేది. ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న దేశాల్లో మన దేశం పదో స్థానంలో ఉంది. ఆహార…

హస్తినకు చేరుకున్న బిఆర్‌ఎస్‌

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌దిల్లీ కి  చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితిని (బిఆర్‌ఎస్‌)‌గా మార్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌   అనుమతివ్వడంతో ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని టిఆర్‌ఎస్‌  ‌పార్టీ కార్యాలయంలో  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ  సంబరం  జరిగింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా…

భద్ర సమాజం కోసం

నేనొక పిరివాడ్ని… కళ్ళూ,కుతంత్రాలే శ్వాస,ధ్యాసగా కల్గి, ద్వేషాలు,మోసాలు రాజ్యమేలుతూ, అరిషడ్వర్గాలు తమ ప్రతాపం చూపిస్తోన్న నేటి సమాజంలో నా బతుకు నేను బతకలేని పిరివాడ్ని. ఓట్లు కొని కాట్లు వేస్తూ అందలమెక్కి మెక్కే, స్వార్థపరుల్ని ప్రశ్నించే సత్తువ లేని పిరికి పౌరుడ్ని. అడుగడుగునా అబద్ధాల పంజా విసురుతూ, మానవీయ విలువలకు తిలోదకాలిస్తూ, చర్మం దళసరెక్కిన దుస్సాహస…

కలలు కరిగిపోతే కన్నీళ్లే మిగులుతాయి

‘‘‌పోటీతత్వాన్ని తట్టుకుని నిలబడితేనే ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్న  కారణంతో చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలను రెండు మూడు సంవ త్సరాల పసిప్రాయంలోనే  ఇంటికి దూరంచేసి, ప్రేమాప్యా యతలను చెరిపేసి, చిరుప్రాయంలోనే దూరప్రాంతాలకు పంపించి,లక్షలు వెచ్చించి తాము ఆర్ధిక బాధలకు గురైనా, తమ పిల్లలు గొప్పవారు కావాలనే ఏకైక లక్ష్యంతో  కష్టాల పాలౌతున్నారు. బాహ్య ప్రపంచానికి దూరమై…

యాంటీబయాటిక్స్ అతి వాడకంతో ఆరోగ్య సంక్షోభం

‘‘‌వీటిని పరిమితికి మించి వాడటం వల్ల మన శరీరం రోగ నిరోధక శక్తిని కోల్పోతుందని, దాని వల్ల వాతావరణం, వయస్సు రీత్యా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తట్టుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.యాంటీబయోటిక్స్‌ను విచ్చలవిడిగా వాడటంపై ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిపుణులు, వైద్య సంస్థలు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.’’ బ్యాక్టీరియా, వైరస్‌ ‌వంటివి యాంటీబయాటిక్స్‌ను తట్టుకుని…

స్మార్ట్ ‌ఫోన్‌ అతిగా వాడడం వరమా, శాపమా..!

(‘లోకల్‌ ‌సర్కిల్స్’ ‌సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ఆధారంగా) కొరోనా కల్లోలంలో విశ్వ మానవాళి జీవనశైలిలో పలు అనివార్య మార్పులు చోటు చేసుకున్నాయి. లాక్‌డౌన్లు, క్వారంటైన్లు, భౌతిక దూరాలు, పరిశుభ్రత పాఠాలు, ఆన్‌లౌన్‌ ‌విద్యాబోధనలు, వర్క్‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ఆచారాలు, ఆన్‌లైన్‌ ‌జూమ్‌ ‌సమావేశాలు మానవ జీవితంలో ప్రవేశించాయి. విద్యాలయాల మూసివేత, ఆన్‌లైన్‌ ‌చదువులతో విద్యార్థి…