Category శీర్షికలు

ఏపిలో బిఆర్‌సీ ఎంట్రీతో మారనున్న సమీకరణలు

ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ఎం‌ట్రీతో అక్కడి రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది . నిన్నటి వరకు ఏపీలో  ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల మధ్యనే తీవ్ర పోటీ ఉంటుందన్న అభిప్రాయముంది. ఇక్కడ అధికార పార్టీ అయిన వైఎస్‌ఆర్‌, ‌తెలుగుదేశం పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి.…

సామాజిక విప్లవకారిణి..

ఆధునిక భారత ప్రధమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే 192వ జయంతి భారతీయ సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి,ఆధునిక భారత దేశ తొలి మహిళా  ఉపాధ్యాయిని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే  మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో, 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో…

జీవుల మనుగడకై జీవవైవిధ్యం

భూమిపై జీవాల మధ్య భేదాన్నే ‘జీవవైవిద్యం’ అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిద్యం సుమారు 3.5 బిలియన్‌ ‌సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం, కాలుష్యం, చెందడంతో భూగోళం వేడెక్కి పోతుంది. దీంతో జీవవైవిద్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇదివరకూ ప్రతి ఇంటిలో అనేక రకాల జంతువులు,…

మానవీయశాస్త్ర అధ్యయనానికి డిజిటల్ వెలుగులు

సాంప్రదాయ మానవీయ శాస్త్రాల పరిశోధనలు, లోతైన అధ్యయనాల్లో డిజిటల్‌ టెక్నాలజీని వాడుకోవడాన్ని ‘డిజిటల్‌ మానవీయశాస్త్రం’ లేదా ‘డిజిటల్‌ హుమానిటీస్‌’గా అర్థం చేసుకోవాలి. డిజిటల్‌ వనరులను ఉపయోగించి హుమానిటీస్‌ విభాగాలను అధ్యయనం చేయడంతో పాటు పలు విభాగాల సహకారంతో పరిశోధనలు, బోధనలు, ముద్రణలు చేయడాన్ని “డిజిటల్‌ హుమానిటీస్‌”గా నిర్వచిస్తారు. హుమానిటీస్‌ పరిజ్ఞాన పరిధి పుస్తకాల ముద్రణ, పంపిణీలను…

నూతన సంవత్సరాది పూర్వాపరాలు

ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో సంవత్సరాది పండగను వివిధ దినాలలో జరుపుకుంటారు. ఇలా జరుపుకోవడానికి కారణం సంవత్సర పరిగణన వేరువేరు మాసాలలో జరగడమే. ప్రపంచంలో అత్యధికులు ఆచరించేది ప్రస్తుత గ్రెగేరియన్‌ ‌క్యాలెండర్‌ ‌క్రీ.శ.1582లో రూపొందించినది. జనవరి 1వ తేదీన నూతన సంవత్సర తొలి రోజును పండగలా జరుపుకోవడం సాపేక్షంగా కొత్త దృగ్విషయం. క్రీ.పూ.2000లో వసంత సమరాత్రి సమయాన…

గురు దక్షిణ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ద్రోణాచార్యుడు శిష్యులను గురుదక్షిణ కోరాడు. ద్రుపదుని బంధించి తీసుకుని రమ్మని కోరాడు.ఇదే నాకు మీరిచ్చే గురుదక్షిణ అన్నాడు. పాండవులూ, కౌరవులూ ఇద్దరూ బయలుదేరారు. ద్రుపదుడు తన సోదర సమేతుడై దుర్యోధనాదులను ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడూ, దుశ్శాసనుడూ, జలసంధుడూ, కర్ణ,  వికర్ణులూ ద్రుపదుని బంధించాలని ఆయన ముందు నిలిచారు. కురు సంతతి…

2023 ముంగిట్లో మాంద్యం..!

‘‘‌గతానికి వీడ్కోలుకు పలుకుతూనే కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం చెప్పాల్సిన సమయమిది. లాక్‌డౌన్లు, కొరోనా వేవ్‌ల దెబ్బకు 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తల్లకిందులయ్యాయి. 2022లో నెమ్మదిగా పుంజుకుంటున్న దశలో పులిద పుట్రలా రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం వొచ్చిపడింది. దీంతో పలుదేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపో యింది. కొత్త ఏడాదిలో కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని.. ప్రపంచం…

రాజకీయ ప్రకంపనలు లేపిన 2022

ఎన్నికల ముందు సంవత్సరం కావడంతో 2022 అంతా రాజకీయ వేడి రాచుకుంది. ఒకవిధంగా రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసిందనే చెప్పాలె. రానున్న ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను విస్తృతం చేసిందికూడా ఈ సంవత్సరమే. ఆందోళనలు, నిరసన సభలు, సవాళ్ళు, పాదయాత్రలతో రాష్ట్రం రాజకీయ రణరంగంగా మారింది. కాగా…

కాలానికి రోషమెక్కువే…

జరిగేది తెలియనప్పుడు కోల్పోవడమేమిటి? పొందటమేమిటి? జమా ఖర్చులతో పొగిడినా,నిందించినా కాలానికి రోషమెక్కువే తెలియకుండా ఓ అర్హతనిచ్చి గౌరవంగా మనసుకు గుర్తింపునిచ్చి ముఖంపై వేగనిరోధంలేని మాటల ప్రయాణంలో తిలకించిన దృశాలలో కాలం అడుగులను లిఖించిన వాస్తవాలను మది మడుగులో మగ్గపెట్టి తలపుకొచ్చే క్షణకాలంలో చిగురించిన సువాసనాలతో దేహాల్లో ఊహలు తలుపు తెరచుకుని చిరిగిన కలకు చికిత్సతొ అరిగిన…