– ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు
– సుప్రీంకోర్టుకు వివరించిన కేంద్ర ప్రభుత్వం
న్యూదిల్లీ, ఆగస్టు 3: జంతర్‌మంతర్ వద్ద గత నెలలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా నమోదైన ఎఫ్‌ఐఆర్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హాపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విద్యార్థులపై నమోదైన కేసులను ముందుకు తీసుకెళ్లబోమన్న తమ హామీకి కట్టుబడి ఉన్నామని ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ హామీని అత్యంత బాధ్యతగా అమలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన హా కేవలం మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ కనిపించాలని పేర్కొంది. గతంలో ఇచ్చిన హాలకు విరుద్ధంగా విద్యార్థులపై అనవసరమైన చట్టపరమైన చర్యలు కొనసాగించకూడదని సూచించింది. విద్యార్థులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల దర్యాప్తు అంశంపై వివాదం కొనసాగుతుండటంతో, ప్రభుత్వం తన హాని ఎలా అమలు చేస్తుందనే అంశంపై కోర్టు దృష్టి సారించింది. ఇక విద్యార్థుల ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న సీజేపీ మాత్రం ప్రభుత్వం ఇచ్చిన హా ప్రకారం అన్ని ఎఫ్‌ఐఆర్‌లను పూర్తిగా ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తోంది. హామీలు అమలు కాకపోతే దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





