– మంత్రి సీతక్కతో పంచాయతి కారోబార్ల సంఘం భేటీ
– ఫైల్‌ను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: తమకు 51 జీవో నుండి మినహాయింపు కల్పించి పే స్కేల్ వర్తింపచేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగుల (కారోబార్ల) సంఘం నాయకులు ప్రజాభవన్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కకు శనివారం విన్నవించుకున్నారు. గత 35 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో కారోబార్లుగా పనిచేస్తున్న తమకు 51 జీవోను మినహాయించి, బిల్ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించి పే స్కేల్ వర్తింపచేయాలని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. వీటిపై ఆమె సానుకూలంగా స్పందించిచారు. పే స్కేల్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో గ్రామ పంచాయతీ కారోబార్స్ రాష్ట్ర నాయకులు మామిడాల నర్సింహులు, శ్రీనివాస చారి, రవి యాదవ్, నాగరాజు, శ్రీధర్ యాదవ్, వెంకటేష్, సురేందర్, కట్టయ్య తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





