ఒకరి మృతి.. పలువురికి గాయాలు
శంషాబాద్ ఓఆర్‌ఆర్ పరిధిలో వరుసగా ఢీకొన్న పది కార్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: నగరంలోని బాలానగర్‌లో కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని ముస్తాక్(19)గా గుర్తించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుంటే శంషాబాద్ పరిధిలో ఓఆర్‌ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. 10 కార్లు వరుసగా ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఆదివారం అర్ధరాత్రి చెన్నమ్మ హోటల్ సవిూపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అందులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఓ కారు డ్రైవర్ మితివిూరిన వేగంతో వెళ్లి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక వస్తున్న 10 కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో 2 కి.విూ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.