– మంత్రులు అడ్లూరి, వాకిటి అభినందనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: దేశంలో మొదటిసారిగా జరిగిన కేనో స్ప్రింట్ పోటీలు శుక్రవారం ముగియగా తెలంగాణ జట్లు అత్యధిక పతకాలు గెలుచుకొని ఓవరాల్ ఛాంపియన్‌గా నిలవగా అస్సాం రెండవ స్థానాన్ని, మహారాష్ట్ర మూడవ స్థానాలను గెల్చుకొన్నాయి. వారికి, ఇతర రన్నర్ అప్ రాష్ట్రాల జట్లకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిలు బహుమతులను ప్రదానం చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద నిర్వహించిన రేసులులో రాష్ట్రం విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు మంత్రులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ తమ కృషి, క్రమశిక్షణతో దేశవ్యాప్తంగా క్రీడా రంగంలో రాష్ట్రం గర్వకారణంగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో రూపొందిన స్పోర్ట్సు పాలసీ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తోందని తెలిపారు. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం, పతకాలు సాధించడం లక్ష్యంగా క్రీడాకారులు నిరంతరం శ్రమించాలని, క్రీడా స్పూర్తి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం జీవితంలో విజయాలకు పునాది అని పేర్కొన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో 9 రాష్ట్రాల నుండి వచ్చిన 150 మంది క్రీడాకారులు పాల్గొనడం గర్వకారణం. తెలంగాణ క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరచినందుకు హృదయపూర్వక అభినందనలు. విజేతలు, రన్నరప్‌లతోపాటు పాల్గొన్న ప్రతి క్రీడాకారుడూ అభినందనీయులు. ఈ రకమైన జాతీయ క్రీడా కార్యక్రమాలు యువతలో పోటీ భావన, క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయి అని అన్నారు. నిర్వాహకులు, కోచ్‌లు, జడ్జీలు, హుస్సేన్ సాగర్ వద్ద సమన్వయం చేసిన అధికారులు, వలంటీర్లను మంత్రులు అభినందించారు. అంతేకాక విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మద్దతు కూడా క్రీడాకారుల విజయాలకు మూలాధారం అని మంత్రులు ప్రశంసించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





