దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌

  • ‌సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలి
  • మీడియాతో ప్రధాని మోదీ ఆకాంక్ష

పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ‌దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.  ఈ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంట్ వెలుపల ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని నేను భావిస్తున్నాను. మూడోసారి ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారు. పార్లమెంటులో సంపూర్ణ బడ్జెట్‌  ‌ప్రవేశపెట్టబోతున్నాం.

ఈ బడ్జెట్‌  ‌ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని ఆశిస్తున్నాను. ఈ బడ్జెట్‌  ‌వికసిత్‌ ‌భారత్‌కు ఊతం ఇస్తుంది. ఇన్నేవేషన్‌ఇన్‌క్లూజన్‌ఇన్వెస్ట్‌మెంట్‌ ‌లక్ష్యంతో దూసుకెళ్తున్నట్లు’ మోదీ చెప్పారు. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు మోదీ తెలిప్పారు. ఇప్పుడు జరిగే పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరిపేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

జనవరి 31 నుండి ఏప్రిల్‌ 4 ‌వరకు రెండు విడతల్లో బడ్జెట్‌  ‌సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 16 బిల్లులను ప్రవేశపెట్టాలని చూస్తోంది. వీటిల్లో వక్ప్ (‌సవరణ) బిల్లుబ్యాంకింగ్‌ ‌చట్టాల (సవరణ) బిల్లురైల్వే (సవరణ) బిల్లువిపత్తు నిర్వహణ (సవరణ) బిల్లుతో పాటు పలు బిల్లులను ప్రభుత్వం పెట్టనుంది. బడ్జెట్‌   ‌ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని భరోసా ఇచ్చారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page