యూరియా కొరతపై వాయిదా తీర్మానం

– తిరస్కరించిన స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌
‌- చర్చించాల్సిందేనంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పట్టు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 2: అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. యూరియా కొరతపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు. దీంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌ ‌సభ్యుల నిరసనపై మంత్రి శ్రీధర్‌ ‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలా చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతీ అంశంపై జవాబు చెబుతామని తెలిపారు. ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయని, ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉందని, సభకు సహకరించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను శ్రీధర్‌ ‌కోరారు. సభ్యుల ఆందోళనల నడుమే స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అంతకుముందు యూరియా కొరతపై చర్చించాలంటూ అసెంబ్లీ మెంబర్స్ ఎం‌ట్రీ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్ల‌కార్డులు ‌ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో యూరియా కొరతపై శాసనసభలో బీఆర్‌ఎస్‌ ‌వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు, ఎరువుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానల వల్ల కలుగుతున్న నష్టాలపై సభలో వెంటనే చర్చ చేపట్టాలని ఎమ్మెల్యేలు కేటీఆర్‌, ‌గంగుల కమలాకర్‌, ‌కల్వకుంట్ల సంజయ్‌ ‌కోరారు. ఈ మేరకు రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై సభలో వెంటనే చర్చ జరపాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం పెట్టారు.

ప్లకార్డులతో బీఆర్‌ఎస్‌ ‌ప్రదర్శన :అడ్డుకున్న పోలీసులు

రాష్ట్రంలో యూరియా సంక్షోభంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. యూరియా కొరతకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని శాసనసభలో నిరసన తెలిపారు. షాపుల్లో దొరకని యూరియా యాప్‌ల్లో దొరుకుతుందా?, కాంగ్రెస్‌ ‌వచ్చింది.. యూరియా కొరత వచ్చిందని ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో శాసన సభకు వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులతో లోనికి వెళ్లవద్దని సూచించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. నేను మాట్లాడిన తర్వాతనే మీకు సరెండర్‌ ‌లీవ్‌ల డబ్బులు వచ్చాయి.. ఇప్పుడు యూరియా మీద కూడా రైతుల పక్షాన మాట్లాడితేనే వస్తుందని ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page