‘గురుకుల బాట’లో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, పార్టీ నాయకులు
హాస్టళ్లలో సమస్యలపై అధ్యయనం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 :బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన గురుకుల బాట కార్యక్రమంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. గురుకుల బాట ఫైవ్ మెన్ కమిటీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, సభ్యులు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, డాక్టర్ ఆంజనేయ గౌడ్, విద్యార్థి అధ్యక్షులు గెళ్ళు శ్రీనివాస్ ఆదివారం ఇబ్రహీంపట్నం లోని షేర్ గూడ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీ,కస్తూర్భా బాలికల కళాశాలకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకొని రికార్డు చేసుకున్నామని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
మరోవైపు సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు గురుకుల బాట కార్యక్రమం నిర్వహించారు. పలు ప్రభుత్వ హాస్టళ్లను బిఆర్‌ఎస్ విద్యార్ధి సంఘం నాయకులు సందర్శించారు. కాగా గత కొంతకాలంగా రాష్ట్రంలోని గురుకుల, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండగా.. ఆయా ఘటనలపై బీఆర్‌ఎస్ పార్టీ ‘గురుకుల బాట’ కార్యక్రమాన్ని చేపట్టి, ఫైవ్ మెన్ కమిటీని వేసింది. ఈ కమిటీ గురుకులాలను, హాస్టళ్లను తనిఖీ చేసి.. ఆ రిపోర్ట్ సహాయంతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది.