కళ్లుండి చూడలేని కబోధులు కాంగ్రెస్‌ నేతలు

కేంద్ర బడ్జెట్‌ లో పన్నులు, పథకాల రూపంలో
తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు
తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దం
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ చీకటి మిత్రులు…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : కేంద్ర బడ్జెట్‌ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దమని,కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని కబోధులు కాంగ్రెస్‌ నేతలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించిందని వెల్లడిరచారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  6 గ్యారంటీలపై డైవర్ట్‌ చేయడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్‌ నడుస్తోంది.  తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల వారీగా కేంద్రం ఏం చేసిందో, రాష్ట్రం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధమా? తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో? ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చకు మేం సిద్దం. ప్రధాని హోదాకు గౌరవం ఇవ్వకుండా అవాకులు పేలడం సరికాదు. ట్యాక్స్‌ డివల్యూషన్‌ రూపంలో 29 వేల 899 కోట్ల రూపాయలు కేటాయించాం. గత ఏడాదితో పోలిస్తే 10 శాతం నిధులు పెంచాం. గ్రాంట్ల రూపంలో 21 వేల 75 కోట్లు,  రైల్వేల అభివృద్ధికి 5 వేల 336 కోట్లు కేటాయించాం.   యూపీఏ హయాంతో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, అభివృద్ధి కోసం ఈ ఏడాది బడ్జెట్‌ లో తెలంగాణకు 2 వేల 500 కోట్ల మేరకు రుణాలివ్వబోతున్నాం. తెలంగాణలో రోడ్లు, రైళ్లు, విమానయాన రంగాల అభివృద్ధికి  28 వేల 302 కోట్లు కేటాయించాం. ఇందులో జాతీయ రహదారుల విస్తరణ కోసం 15 వేల, 640 కోట్లు, తెలంగాణలోని విద్యుత్‌, ఇంధన, నీటిపారుదల రంగాల కోసం 10 వేల 285 కోట్లు,  తెలంగాణలోని గ్రామాల, పట్టణాల అభివృద్ది కోసం ఈ ఏడాది మొత్తం 6 వేల 320 కోట్లు ఖర్చు చేయబోతున్నాం.  ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనలో భాగంగా ఇండ్ల నిర్మాణం కోసం 2 వేల 120 కోట్లు కేటాయించాం.

తెలంగాణలో వ్యవసాయం, సహకార, పశుసంవర్థక శాఖల ద్వారా రైతులకు మేలు చేసేందుకు 5 వేల 920 కోట్లు ఖర్చు చేయబోతు న్నాం. తెలంగాణలోని ఆరోగ్యం, పారిశుధ్య రంగాల కోసం ఈ ఏడాది మొత్తం 5వేల 790 కోట్లు కేటాయించాం. విద్యా, క్రీడా రంగాల అభివృ ద్ధి కోసం ఈ ఏడాది 4 వేల 930 కోట్లు ఖర్చు చేయబోతున్నం. ఎంఎస్‌ఎంఈ పథకాలు, రుణ సబ్సిడీల కోసం 2 వేల 150 కోట్లు,  అలాగే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ కోసం 880 కోట్లు రాష్ట్రంలోని మహిళా, శిశు సంక్షేమ రంగాల అభివృద్ది కోసం 3 వేల 560 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అలాగే హోం, జాతీయ విపత్తు నిర్వహణ, రక్షణ కార్యక్రమాల అమలుకు 3 వేల 290 కోట్లు కేటాయించాం. కేంద్ర సంక్షేమ పథకాలకు సంబంధించి నేరుగా (డిబిటి) లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేసేందుకు 5 వేల 420 కోట్లు కేటాయించాం. తెలంగాణలోని పర్యాటక, సాంస్కృతిక రంగాల అభివృద్ధి  కోసం 1210 కోట్లు. అటవీ, పర్యావరణ శాఖలకు 980 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. బడ్జెట్‌ లో ఉద్యోగులకు 12 లక్షల 75 వేల వరకు ట్యాక్స్‌ కట్టే పనిలేకుండా మినహాయింపు ఇచ్చాం. ఒక్కో రైతుకు 5 లక్షల వరకు క్రెడిట్‌ కార్డులు ఇవ్వబోతున్నాం. తెలంగాణ సహా దేశంలోని యువతకు ఉపాధిని పెంచేందుకు ఎంఎస్‌ ఎంఈ క్రెడిట్‌ బూస్ట్‌ కింద 1 లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. చిన్న వ్యాపారులకు రూ.5 లక్షల రూపాయల వరకు కస్టమ్‌ క్రెడిట్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఈసారి ఏకంగా 10 వేల కోట్ల రూపాయలతో ఫండ్‌ ను ఏర్పాటు చేస్తున్నాం.

ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన కింద కోటి మంది గిగ్‌ కార్మికులకు ఆరోగ్య సంరక్షణ కవరేజ్‌ అందించబోతున్నాం. తొలిసారిగా వ్యాపారాన్ని, పరిశ్రమలను ప్రారంభించబోయే 5 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల చొప్పున టర్మ్‌ రుణాలందించబోతున్నం. దేశానికి సంబందించిన బడ్జెట్‌ లో ఒక రాష్ట్రం పేరు లేనంత మాత్రాన ఆ రాష్ట్రానికి నిధులివ్వలేదని సరికాదు. కృష్ణా జలాలు వాటాలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలే.. ఏపీతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్‌.  ఎస్సెల్బీసీ ప్రాజెక్టు కట్టకుండా జాప్యం చేసింది కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలే. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వేలెత్తి చూపింది మేమే. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎమ్మెల్సీ అభ్యర్థులే కరువయ్యారు…ఇగ ఆ పార్టీ యాడుంది? బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ చీకటి మిత్రులు… కాళేశ్వరం, డ్రగ్స్‌, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు, ఫార్ములా ఈ రేస్‌ కేసులేమైనయ్‌…?లి దిల్లీకి పోయి కాంప్రమైజ్‌ అయిన మాట నిజం కాదా? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. భూపాలపల్లి రాజలింగమూర్తి హత్యపై విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఎంక్వైరీ కాకముందే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదు…బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి..  అందులో 10 శాతం ముస్లింలకు కేటాయిస్తే ఏం న్యాయం చేసినట్లు, దీనిపై సీఎం క్లారిటీ ఇవ్వాలి అని డిమాండ్‌ చేశారు.కుల గుణన తప్పుల తడక… జనాభా లెక్కలే తప్పు. 3.95 కోట్ల ఆధార్‌ కార్డులుంటే… జనాభా 3.7 కోట్లు ఎట్లా ఉంటారు? 6 గ్యారంటీలే ప్రధానాస్త్రాలుగా కాంగ్రెస్‌ కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని, మతపరమైన రిజర్వేషన్లకు మేం పూర్తిగా వ్యతిరేకమని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారని, వాళ్లు రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌  న్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page