– హామీలు గుప్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5ః: మున్సిపాలిటీల్లో బిజెపిని గెలిపిస్తే నిధుల వరద పారిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మున్సిపాలిటీలకు వచ్చేది కేంద్ర నిధులేనని అన్నారు. గ్రామ పంచాయతీలకు ఇప్పటికే కేంద్రం రూ.259 కోట్లు విడుదల చేసిందని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మొదటి విడతగా తెలంగాణకు రూ.500 కోట్లు తీసుకొస్తామని బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ సూపర్ బజార్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి అభివృద్ధి పనుల కోసం రూ.వందల కోట్లు తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని పరికరాలు తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం సరైన సిబ్బందిని నియమించట్లేదు. గత పదేళ్ల నుంచి హుజూరాబాద్ అభివృద్ధి చెందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు నెరవేర్చిందా? ఈ ప్రభుత్వం హుజూరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి ఒక్కపైసా ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఇక్కడ మినీ స్టేడియం నిర్మిస్తాం. కాంగ్రెస్‌ను గెలిపిస్తే అన్ని ట్యాక్సులు పెంచుతారు. మేం దిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి హుజూరాబాద్‌ను అభివృద్ధి చేయిస్తామని కేంద్ర మంత్రి బండి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





