హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15ః ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లును పలువురు మంత్రులు, ప్రముఖులు సోమవారం కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దుదిళ్ల శ్రీధర్‌బాబు, దనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలతోపాటు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ తదితరులు భట్టికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్ల్లా భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





