హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22: ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ (Bhagya Reddy Varma) 137 వ జయంతిని పురస్కరించుకొని గురువారం సాయంత్రం తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అకాడమీ కార్యదర్శి నామోజు బలాచారి పూలమాలవేసి నివాళులర్పించారు. నిరంతర సామాజిక సేవ ద్వారా సంఘంలో సమున్నత స్థానం సంపాదించుకున్న గొప్ప మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని తెలంగాణ సాహిత్య అకాడమీ గణంగా నివాళి అర్పించింది. ఒకనాటి ‘మాదిరి భాగయ్య’ కాలం మారే కొద్దీ భాగ్యరెడ్డి వర్మగా సమాజంలో ఎలా గుర్తింపు పొందారో వారి చరిత్ర చదివిన వారికి అర్థమవుతుంద అన్నారు. అంతే కాదు, వారు దళిత జనోద్ధారకుడుగా, సంఘసంస్కరణ ఉద్యమ నాయకుడుగా, పత్రికా సంపాదకుడుగా, అనర్గల వక్తగా, ముఖ్యంగా మానవతావాదిగా బహుముఖ ప్రతిభ కలిగిన భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ నగరంలో జన్మించడం మనందరి గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీలో వారి జయంతిని జరపడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ సిబ్బందితోపాటు సాహితీవేత్తలు పాల్గొని నివాళులర్పించారు.
సమాజంలో భాగ్యరెడ్డి వర్మకు సమున్నత స్థానం
