భద్రాచలం రామా లయ నూతన పూర్తి అదనపు బాధ్యతలతో ఇంచార్జి కార్యనిర్వ హణాధికారిణీ గా బాధ్యతలు తీసుకున్న యల్.రమాదేవి ని, భద్రాద్రిప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షులు డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్నందించి శాలువతో సన్మానించారు.భద్రాచలం లో సాక్షాత్తూ శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై సోదరుడైన లక్ష్మణస్వామి సహితునిగా నడయాడిన ప్రాం• •మని భారతదేశం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమనీ తెలుపుతూ, ఇటువంటి పవిత్ర పుణ్యక్షేత్రానికి తిరిగి పూర్వవైభవాన్ని ప్రాశస్త్యాన్ని కల్పించాలని డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ మర్యాద పూర్వక భేటీలో కార్యనిర్వహ ణాధికారిణీ ఎల్ రమాదేవి తో దేవస్థానానికి సంబంధించి గత దశాబ్దకాలం నుండి జరుగుతున్న అనేక వివాదాల గురించి, అంతరా లయంలో మాయమైన నగల గురించి మరి కొన్ని ముఖ్య విష యాల గురించి వివరించామని, శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవాలయ పూర్వవైభవాన్ని తిరిగి పొందుపరచేందుకు, శ్రీరామ భక్తులకు కల్పించాల్సిన మరింత సులభమైన దర్శనం,మరిన్ని మెరుగైన సౌకర్యాల గురించి తీసుకోవాల్సిన టువంటి అనేక విషయాలపై నూతన ఇంచార్జ్ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన ఎల్ రమాదేవి కి విన్నవించడం జరిగిం దని అన్నారు. శ్రీరామచం ద్రుని దర్శించే ప్రతి భక్తులు ఆధ్యాత్మికంగా తన్మయత్వం చెందే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ఉద్ఘాటించినట్లు అంతర్జాతీయ గాంథిపథం మరియు భద్రాద్రి ప్రాంత పరిరక్షణసమితి అధ్యక్షులు డా.బూసి రెడ్డి శంకర్ రెడ్డి తెలిపారు.డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి తో పాటుగా పట్టణ ప్రముఖులు డా.యన్.సత్యం, డా.రమేష్ బాబు, పురోహితులు భాస్కరుని రాధాకృష్ణశాస్త్రి మరియు ప్రముఖ ఐ టి సి కాంట్రాక్టర్ బసప్ప రమేష్ తదితరులు పాల్గొని దేవాలయం లో జరుగుతున్న అనేక అపశ్రుతుల గురించి ఈఓ రమాదేవి కి విన్నవించడం జరిగిందని వారు తెలిపారు.