వేగుంట రాఉడు పాడిన చలిగీతం

చిడతలు ఊడిన రెక్కలకిటికీ తెరిచిపెట్టవద్దని ఒహటే మొత్తుకోలు! వడగాలిలా సుడిగాలిలా ఆ వేళ చలిగాలి రివ్వున వీయడంతో కవిగారి కవోష్ణ హృదయంలో చేతులు కొంగర్లుపోవడం, పై పెదవికి కిందిపెదవికి పోట్లాట మొదలయినా అదేదో వినోదప్రదర్శనలా ఆయనగారి స్వదేహమే పులకరించిపోతూ తిలకించడం! కవిగారికి ఇప్పటివరకు తన హృదయమనే ఎయిర్ కండిషన్డ్ గదిలో వెచ్చగ మునగదీసుకుని మూడంకె వేసి…









