special Stories

special Stories

అమెరికా సామ్రాజ్యవాదం ఎప్పుడు అంతమవుతుంది?

“ఐక్యరాజ్యసమితి, దాని భద్రతా మండలి, స్వీయ రక్షణ కోసం లేదా భద్రతా మండలి అనుమతితో మాత్రమే బలప్రయోగాన్ని అనుమతించే ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా అమెరికా దాడులు, జోక్యాన్ని నియంత్రించాలి.. ఏదైనా అమెరికా సైనిక చర్యను భద్రతా మండలిలో తప్పనిసరి చర్చ, పారదర్శకత, ఓటింగ్‌కు గురి చేయాలి. జోక్యానికి ముందు. బెదిరింపులను ధృవీకరించడానికి…

అమెరికా అహంకారానికి వెనిజువెలా బలి!

“ఒకప్పుడు తనకు అత్యంత మిత్రదేశంగా ఉన్న  వెనిజువెలా ఇప్పుడు ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిపోవడం కూడా అమెరికా సహించలేకపోతున్నది. భారత్‌, చైనా, రష్యా వంటి దేశాలు డీడాలరైజేషన్‌ వైపుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. బ్రిక్స్‌ కూటమిలోని ఇతర దేశాలు కూడా డాలర్‌ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, వెనిజువెలా తాను ఎగుమతి చేస్తున్న చమురుకు డాలర్‌కు బదులు యువాన్‌…

జాతి నిర్మాణం.. వ్యక్తిత్వ వికాసం.. వివేకానంద సం”దేశం”..!

“అక్కడ “మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా” అనగానే సభికులనుంచి విశేష స్పందన లభించింది.మనలోని సోదరత్వపు ప్రకాశానికి యావత్ ప్రపంచం సెల్యూట్ చేసింది.పురాతన సంస్కృతి కలిగిన నా హైందవ దేశం పరమత సహనాన్ని,మత సామరస్యాన్ని బోధించిందని, నదులన్నీ సముద్రంలో కలిసినట్లే విభిన్న మతాల సారాంశం మానవత్వమనే సముద్రంలో కలుస్తుందని చెప్పారు.” “సహనాన్ని, సర్వమత…

గమ్యం లేని జన్ జడ్

Generation Without a Destination

“ఏ ఉద్యమమైనా నిర్మాణాత్మక ఆలోచనతో, బాధ్యతతో జరగాలి. డిజిటల్ యుగంలో ప్రబలిన జన్ జడ్ ఉద్యమాల వలన కొన్ని చోట్ల సత్ఫలితాలతో పాటు, దుష్ఫరిణామాలు కూడా చోటు చేసుకోవడాన్ని యువత గమనించాలి.బంగ్లాదేశ్ ను ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు.జన్ జడ్ ఉద్యమాల ప్రభావంతో ప్రపంచంలోని పలుదేశాలు కంపించిపోతున్నాయి. ఇప్పటికే నేపాల్,బల్గేరియా ప్రభుత్వాలు జన్ జడ్ ఉద్యమాల ఫలితంగా…

డ్యామ్‌ ల నుంచి భూముల వరకూ అన్నీవిధ్వంసమే.!

” వాస్తవానికి పెరుగుతున్న విద్యార్థుల అవసరాల దృస్టి యూనివర్సిటీలకు ఇంకా ప్రభుత్వం భూములు ఇవ్వాలి..వర్సిటీలకు ఎంత ఎక్కువ భూములు ఉంటే అంత మంచింది.విద్యార్థుల విద్యాప్రమాణాలు పెరుగుతాయి.వారు రీసెర్చులు చేసేందుకు అవసరమైన మొక్కలు, ప్రకృతి వనాలు అందుబాటులో ఉంటాయి. వర్సిటీ ఎంత విశాలంగా ఉంటే విద్యార్థుల ఆలోచనలు అంత విశాలంగా ఉంటాయి.ఇరుకు గదుల్లో, సందుల్లాంటి వర్సిటీలుంటే విద్యార్థుల…

కథా అఖిలం

సాహిత్యం సామాన్య కాలక్షేపం కాదు, సమాజ సీమాంతరాలను తడమి తట్టి లేపే సంజీవని సెలయేరు. అక్షరం ఆయుధమైనచో అన్యాయాలను ఖండిస్తుంది, అమృతమైనచో అంతరాత్మను ఆలింగనం చేస్తుంది. రచయిత్రి రాధ ఓడూరి గారి రసమయ రచనలు రూపొందిన “కథా అఖిలం – కథల నిధి” అనే ఈ అమూల్య ఆభరణం, ఆధునిక జీవన జలధారలో మానవత్వ మకరందాలను…

క్వాంటం ప్రపంచం

కాలపు గుండె పుస్తకంలో క్యాలెండర్ పేజీ మారింది జ్ఞాపకాల మెసెంజర్ గ్యాలరీతో ఓ సంవత్సరం వీడ్కోలు పలికింది నులివెచ్చని జ్ఞానకిరణాల వెలుగులో ఆత్మీయ వేడుకల జలధారలో స్వాగతమంటోంది క్వాంటం ప్రపంచం   విజయాలు వివాదాలు విప్లవాలు విషాదాలు వికాసాలు ఇలాంటివెన్నో అనుభూతుల ఇంద్రధనస్సు కదా జీవితమంటే నీలో నీతో బతుకు యుద్ధం నేర్చుకుంటే ప్రతి నిమిషం…

హృదయ పీఠంపై నీవెన్నడూ కూసోలేదు

ప్రియమైన ఇష్టుడా నీకొక ఉత్తరం రాయక ఎన్నో ఏండ్లు గడిచిపోయినవి గడిచిన ఇన్నేండ్లలో నీకో ఉత్తరం రాద్దామనుకున్నపుడల్లా అడ్డుపడి ఆపుతున్న కన్నీళ్లు లోపలా బయటా  భయం ఆవహిస్తున్నపుడూ లోలోపలి భావాలను స్పష్టంగా ఎట్లా చెప్పగలను చెప్పు   ఈ చీకటి రాజ్యం తెరమీద నీవో వెలుగవుతావని కలగన్నా కానీ నీ వెలుగే చుట్టేమీ కండ్లబడకుండా చీకటిని తెస్తుందనుకోలేదు…

కొత్తపొద్దు కోసం

ఇవాళ్టి దుఃఖం రేపటికి మాసిపోవాల అటకెక్కిన ఆనందం ఒక్కో మెట్టు దిగి రావాల గలుమ కాడికొచ్చిన కొత్త పొద్దు తోరణాలు కట్టుకున్న దర్వాజాను తాకుతూ నట్టింట్లో నాట్యమాడాల   కొత్తదనపు కుతి తీరేదాకా పొద్దు తిరుగుడు పువ్వోలె ఇటునుంచి అటేపు పెయ్యిని తిప్పుతూ వుండాల   చాప కింద నీరోలే చీకట్లు అలుముకోకుండా పసిగట్టి ఊడ్చి…

 లెక్కలు తేలేనా ..?

 “ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ను కార్నర్‌ చేయలని చూసి.. ఒక రకంగా సక్సెస్‌ కూడా అయ్యింది కాంగ్రెస్‌ పార్టీ..! కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు.. మేడిగడ్డ కుంగిపోవడం కూడా కేసీఆర్‌ వైఫల్యమే అని ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది..! అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ పేరుతో కేసీఆర్‌ను కూడా విచారించింది..! ఇప్పుడు.. దానికి కౌంటర్‌ అన్నట్లు…