గ్రామాల నిర్లక్ష్యం ప్రగతికి అవరోధం

పల్లె సీమలే ప్రగతికి ఆలవాలం.సిరులు పొంగే గ్రామసీమలు దేశానికి జీవనాడులు. “పల్లెటూరు మన భాగ్య సీమరా…”అంటూ కొసరాజు రాఘవయ్య గారి కలం నుండి వెలువడిన గీతానికి ఐదు పదుల వయసు దాటినా, ఆ పాట నిత్యసత్యంగానే నేటికీ అజరామరమై వెలుగొందుతున్నది.పల్లె సీమలు నిర్లక్ష్యానికి గురవుతున్నా, వాటి గొప్పదనం ఎవరూ కాదనలేని అక్షరసత్యం.పల్లె తల్లి వంటిదనే నానుడి…









