special Stories

special Stories

కాంగ్రెస్ కు సమాధి, టీడీపీ రేవంత్ పునాది..!

“ఎలాగూ ఎన్డీయే కూటమిలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు..ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలంగాణలో టీడీపీ బలోపేతానికి అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ క్యాడర్ కు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.. అటు టీటీడీపీకి భవిష్యత్తు లీడర్ తానే అన్న సంకేతాలు కూడా టీటీడీపీ క్యాడర్ కు రేవంత్ ఇస్తున్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.. పొత్తులతో తప్ప…

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపు: వినోదమా లేక దోపిడీయా?

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పెరిగిన సినిమా టికెట్ ధరలు కేవలం సామాన్యుడి జేబుకు భారంగా మారడమే కాకుండా, ఒక తీవ్రమైన సామాజిక ఆర్థిక చర్చకు దారితీశాయి. అసలు సినిమా అనేది ఒక ప్రజా వినోద సాధనమా లేక లాభమే పరమావధిగా సాగే వ్యాపారమా? అనే ప్రాథమిక ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. సినిమా ఒక సృజనాత్మక కళగా…

సంక్రాంతి

పిల్లా పోదాం పదవే పల్లెకి పిలగా ఏముంది రా పల్లెలో పంట చేతికొచ్చే వేళ జరుపుకునే పండుగకి పోదామే కళకళలాడే లోగిళ్ళను చూద్దామే ఎనకటి రోజులు కావయ్యా ఎదురుచూసే మనుషులు లేరయ్యా పావురంగా జూసుకునే బంధాలు లేవయ్యా ప్రపంచీకరణ బాంధవ్యాలను చిదిమేసిందయ్యా అట్టెట్టనే పిల్లా పచ్చాని పల్లె కళ్ళల్లో తిరుగుతుందే మల్లా ఏం చేద్దునే పిల్లా ఓరోరి పిలగా…

మెరుపు తీగెలు దోషి!

“అమ్మా…” గొంతు నరాలు చిట్లిపోయేలా అరిచాడు ‘దోషి’. “ఒరేయ్… ఆ నోట్లో లాఠీదించి దెం…” యస్సై చెప్పిన మాటని అర్థం చేసుకున్న కానిస్టేబులు దోషి నోట్లో గుడ్డని కుక్కాడు. ఆర్తనాదం అణిగిపోయింది. బోర్లా పడుకోబెట్టిన దోషి వీపుమీద వొక కానిస్టేబులు తొక్కి కూచుంటే, మరో యిద్దరు కానిస్టేబుళ్ళు అరికాళ్ళమీద లాఠీలతో బాదుతూనే వున్నారు. చాలక యస్సై…

అగ్నిపద్యం అలిశెట్టి కవిత

దోపిడి వటవృక్షాలను దహించే అగ్నిపద్యంలా అల్పాక్షరాలతో అనల్పార్థాన్ని సృష్టించిన అక్షరయోధుడు అలిశెట్టి ప్రభాకర్. తుపాకీ తూటాలా తన భావాలను సూటిగా గుండెలను తాకించగల శక్తి అలిశెట్టి అక్షరానిది.  కరెన్సీ స్పర్శ కంటే కవిత్వంలోనే సేదతీరిన రచనా పిపాసి. రాతకు చేతకు లేశమాత్రం తేడా లేని నిండైన నిఖార్సయిన ఆచరణశీలి. నాలుగు పదులు కూడా దాటని అలిశెట్టి…

పాస్‌పోర్ట్

ఒక చిన్న పుస్తకం చేతిలో పట్టుకున్న సరిహద్దు కాగితాల మధ్య నా పేరు ప్రయాణం మొదలుపెడుతుంది ఇందులో దేశం ఉంది కాని నేల లేదు గుర్తింపు ఉంది కాని పూర్తైన మనిషి లేదు నేను ఇక్కడ కేవలం అనుమతి ముద్రలు పడుతుంటే కాలం గీతలు వేస్తుంది ప్రతి స్టాంప్ “నువ్వు వెళ్లవచ్చు” అనే అస్తిత్వపు ఒప్పందం మెటాఫిజిక్స్ అడుగుతుంది భూమి అందరిదైతే ప్రవేశానికి పుస్తకం ఎందుకు మనిషి స్వేచ్ఛ ఎప్పుడు ఫారమ్ అయింది పాస్‌పోర్ట్ చెబుతుంది నువ్వు ప్రపంచ పౌరుడు కాదు ముందుగా ఒక విభాగం ఆ తర్వాతే మనిషి కాలం మారుతుంది వీసా ముగుస్తుంది పాస్‌పోర్ట్ మాత్రం మిగిలిపోతుంది నువ్వు ఎక్కడ ఉండగలవో చెప్పే నిశ్శబ్ద అధికారిగా చివరికి ప్రయాణం ముగుస్తుంది పుస్తకం మూసివేయబడుతుంది కానీ ప్రశ్న తెరిచే ఉంటుంది మనిషి ప్రయాణికుడా లేక సరిహద్దుల సృష్టేనా…

స్థానిక ప్రజాస్వామ్య పరీక్ష: మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల పాత్ర

కుర్చీల కేటాయింపుతో కదిలిన రాజకీయాలు పట్టణ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మరో నిర్ణాయక దశను దాటింది. ఓటరు జాబితా తుదిరూపు దాల్చిన తర్వాత తాజాగా మున్సిపల్ శాఖ రిజర్వేషన్లను పూర్తిగా ఖరారు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలో ఉన్న 131 పట్టణ స్థానిక…

తెలుగు రాష్ట్రాల జల వివాదాల్లో సామరస్యం హుళక్కే?

“తొలి నుండి కూడా రేవంత్ రెడ్డి ప్రకటనలు శూల శోధన గావించితే ఒక్కోసమయంలో ఒక్కో రకంగా మాట్లాడటం గమనించగలం. సామరస్యం అన్న తరువాత అంతా ఏక పక్షంగా వుండదు కదా? ఇచ్చి పుచ్చుకోవడంగా వుండాలి? ఇవన్నీ ఆలోచించకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామరస్యం ప్రతిపాదన చేశారా? ఈ పాటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. నదీ జలాల…

అపహాస్యమవుతున్న అమెరికా ప్రజాస్వామ్యం..!

“వెనిజులా సార్వభౌమత్వాన్ని మంటగలిపిన ట్రంప్ ను ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో  సమర్ధించడం,నోబెల్ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ కు బహూకరించడం విడ్డూరం. వెనిజులా లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రయత్నించకుండా అధికార దాహంతో వెనిజులా నాయకులు అధికార పీఠం కోసం ప్రాకులాడడం సిగ్గుచేటు.   ఇపటికే…

 జిల్లాల కుదింపు వెనుక కుట్రలు..హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌ చేసే ప్రయత్నం.!

“జిల్లాల కుదింపు ఆలోచన సమస్యల తేనె తుట్టేను కదిలించినట్లే అవుతుంది. అంతేకాదు అన్నిటికిమించి హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేయాలన్న కాంగ్రెస్‌ కుట్రలు తిప్పికొట్టాలి. లేకపోతే  ఏ హైదరాబాద్ ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం రగులుకుందో ఇప్పుడు హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ చేస్తే రాష్ట్రం మరోసారి భగ్గుమంటుంది. నాటి ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైతే, ఇప్పుడు…