prajatantra_news

prajatantra_news

భద్రాచలం వద్ద 41 అడుగులకు చేరిన గోదావరి

భద్రాచలం, ప్రజాతంత్ర, జులై 12: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం 41 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ఉంది. పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరుగుతోంది. అధికారులు డీఆర్‌డీఎఫ్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సాయంత్రానికి 41.30 అడుగులకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం 23 అడుగులే…

నిర్మాణంలోని స్లాబ్‌ కూలి నలుగురికి గాయాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: మేడ్చల్‌ జిల్లా పోచారం పోలీసు స్టేషన్‌ పరిధి వెంకటాపూర్‌లోని అనురాగ్‌ యూనివర్సిటీలో శనివారం ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్‌ కూలి నలుగురు సెంట్రింగ్‌ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని నీలిమ హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు…

బాలాపూర్‌ రీసెర్స్‌ సెంటర్‌లో చిరుతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్సీఐ) ప్రాంగణంలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఇక్కడ రెండు చిరుత పులులను గుర్తించిన అటవీ శాఖ అధికారులు వాటి కోసం ఆర్సీఐ అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు, చిరుతలను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం చిరుతలు ఓ…

రైతాంగ పోరాట యోధుడు దొడ్డ నారాయణరావు కన్నుమూత

– పోరాటంలో ఆయన పాత్ర కీలకమైనది – గ్రంథాలయ ఉద్యమంలో చురుకైన పాత్ర – మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌, సీపీఐ నేత నారాయణ సంతాపంహైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, సిపిఐ ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ కార్యదర్శి దొడ్డ నారాయణరావు (96) శుక్రవారం రాత్రి ఆయన స్వగృహంలో…

సత్ఫలితాలు ఇచ్చిన ‘బడిబాట’

ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌ హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బడిబాట కార్యక్రమం సత్ఫలితాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎక్స్‌ వేదికగా దీనిపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎందరో పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, వివిధ తరగతుల్లో మొత్తం 3.68 లక్షల మంది చేరారని తెలిపారు.…

రేపు ఓయూకు భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

ఠాగూర్ ఆడిటోరియంలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి హాజ‌రు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 11 :  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్  రామకృష్ణ గవాయ్ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రానున్నారు. శనివారం  మధ్యాహ్నం 3.30 గంటలకు ఠాగూర్ ఆడిటోరియంలో “భారత రాజ్యాంగ రూపకల్పనలో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్క‌ర్” అనే అంశంపై విశిష్టోపన్యాసం చేస్తారు. కార్యక్రమానికి భారత అత్యున్నత…

పేదల కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి ధనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జులై 11: పేదవాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు, నిర్మాణం పనులకు ఆమె…

కల్లు బాధితుల ఆరోగ్యస్థితిపై మంత్రి దామోదర ఆరా

నాగర్‌కర్నూలు, ప్రజాతంత్ర, జులై 11: నాగర్‌కర్నూల్‌ జిల్లా పర్యటనలో ఉన్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిమ్స్‌, గాంధీ డాక్టర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి కల్తీకల్లు బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. పేషెంట్ల పరిస్థితి గురించి డాక్టర్లు ఆయనకు వివరించారు. ప్రస్తుతం నిమ్స్‌లో 35మంది, గాంధీలో 18మంది చికిత్స…

రామచందర్‌రావుకు సీనియర్‌ నాయకుల అభినందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్‌.రామచందర్‌రావును పార్టీ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ ట.ి రాజేశ్వరరావు, వెంకటరమణి, చింత సాంబమూర్తి, రామకృష్ణారెడ్డి, పి. సుగుణాకర్‌రావు, ధర్మారావు, మల్లారెడ్డి, పాపారావు తదితరులు కలిశారు. ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రామచందర్‌రావు నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వారు…

ప్రతి మండలానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

– ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో – ఐదు నక్షా గ్రామాల్లో రీసర్వే పూర్తి – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: వెన్యూ వ్యవస్ధను మరింత బలోపేతం చేసి భూ సమస్యలపై సామాన్యులకు మెరుగైన సేవలందించడానికి వీలుగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచనల మేరకు…