prajatantra_news

prajatantra_news

చనిపోయిన ఐదేళ్లకు డెత్‌ సర్టిఫికెట్‌ జారీ  

~ శ్రీపాద నరేష్‌ మృతిని ధ్రువీకరించిన బహరేన్‌లోని ఇండియన్‌ ఎంబసీ  – ఇపుడు శవాన్ని ఇండియాకు తరలించడం సాధ్యం కాదు – అంత్యక్రియలు అక్కడే నిర్వహించాలని ఎంబసీ సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: గల్ఫ్‌ దేశమైన బహరేన్‌లో చనిపోయిన తెలంగాణ వాసికి ఐదేళ్ల నాలుగు నెలల తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం (డెత్‌ సర్టిఫికెట్‌)…

రూ.304కోట్ల ఒవ‌ర్‌సీస్ స్కాల‌ర్‌షిప్ బ‌కాయిల విడుదల

– విదేశాల్లో విద్యార్థుల ఇబ్బందుల‌ను గుర్తించాం – అర్హుల‌కే ఈ స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తాం – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30: గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిష్టంగా ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓవర్సీస్ స్కాలర్ షిప్ బకాయిలకు సంబంధించిన‌ నిధులు విడుదల చేశామ‌ని…

ప్రభుత్వం ఆదుకుంటుంది.. అధైర్యపడొద్దు

– హుస్నాబాద్‌ నియోజకవర్గ రైతులకు మంత్రి పొన్నం హామీ – వరద ప్రాంతాలు, తడిసిన ధాన్యం పరిశీలన – ఓ రైతుకు తక్షణ సాయంగా రూ.10వేలు అందజేత హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : తుఫాన్‌ కారణంగా ఊహించని విధంగా, ఎప్పుడూ లేనివిధంగా మూడు జిల్లాల పరిధిలో ఉన్న హుస్నాబాద్‌ నియోజకవర్గంలో వర్షం కురిసింది.. వందలాది…

యాద‌గిరిగుట్ట‌లో మెగా రక్త దాన శిబిరం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర,  అక్టోబర్ 30: పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా  యాదగిరిగుట్ట పట్టణంలోని లక్కీ ఫంక్షన్ హాల్‌లో యాదగిరిగుట్ట పోలీసులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పిలుపు మేరకు యాదగిరిగుట్ట ఏసిపి బీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వ‌హించ‌గా పెద్ద సంఖ్య‌లో దాత‌లు వ‌చ్చి ర‌క్త‌దానం చేశారు.…

రేపు మంత్రివ‌ర్గ విస్తరణ

– అజారుద్దీన్‌ ‌కోసం ప్రత్యేకం – రాజ్‌భవన్‌ ‌దర్బార్‌ ‌హాలులో ఏర్పాట్లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌  30: ‌ రేపుమంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు కొత్త మంత్రిగా అజారుద్దీన్‌  ‌ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో కేబినెట్‌ ‌మంత్రిగా కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు.…

మున్నేరు వాగు ఉధృతితో మరోమారు ఆందోళన

– ఖమ్మం-బొమ్మకల్‌ ‌రహదారిపై భారీగా వరద ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: ‌మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు ఖమ్మంలోని మున్నేరు వాగు మరోమారు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతకంతకూ నీటిమట్టం పెరగడంతో మరోమారు భయాందోళనలు మొదలయ్యాయి. వాగు పరివాహకంలోని కాలనీలను వరద చుట్టుముట్టింది. మోతీనగర్‌, ‌బొక్కలగడ్డ కాలనీల్లోకి వరద చేరింది. మోతీనగర్‌లోని 35, బొక్కలగడ్డలో 57…

ప్యారడైజ్‌ ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌పనులు

– 9 నెలల పాటు ట్రాఫిక్‌ ‌మళ్లింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌30: ‌ప్యారడైజ్‌ ‌జంక్షన్‌ ‌నుంచి డెయిరీఫామ్‌ ‌రోడ్‌ ‌వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్‌ ‌కారిడర్‌ ‌నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని జాయింట్‌ ‌కమిషనర్‌ ‌డి. జోయల్‌ ‌డేవిస్‌ ‌తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్‌ ‌మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు.…

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

– వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం పర్యటన సిద్దిపేట,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌సిద్దిపేట జిల్లా కోహెడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గురువారం పర్యటించారు. పోరెడ్డిపల్లి గ్రామంలో భారీ వర్షం కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. పంట నష్టంతో ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు.…

జూబ్లీహిల్స్ ‌వోటర్లను ప్రభావితం చేసే చర్య

– మంత్రివర్గ విస్తరణను వెంటనే ఆపాలి – అజారుద్దీన్‌కు పదవి కేవలం మైనార్టీలను దువ్వడమే – ఎన్నికల అధికారికి బిజెపి నేతల ఫిర్యాదు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌జూబ్లీహిల్స్ ‌వోటర్లను ప్రభావితం చేసేలా చేస్తున్న మంత్రివర్గ విస్తరణను ఆపాలని బిజెపి ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇది కేవలం ఓ వర్గం వారిని మచ్చిక చేసుకునే చర్య తప్ప…

మరో రూ.2వేలు తగ్గిన పసిడి ధరలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 30: బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పదిహేను రోజుల క్రితం రికార్డు స్థాయికి చేరిన పసిడి ధర, ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాల వల్ల బంగారంతోపాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గత రెండు వారాల్లో పసిడి భారీగా తగ్గింది. ఈ…