రూ.304కోట్ల ఒవ‌ర్‌సీస్ స్కాల‌ర్‌షిప్ బ‌కాయిల విడుదల

– విదేశాల్లో విద్యార్థుల ఇబ్బందుల‌ను గుర్తించాం
– అర్హుల‌కే ఈ స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తాం
– మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30: గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిష్టంగా ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓవర్సీస్ స్కాలర్ షిప్ బకాయిలకు సంబంధించిన‌ నిధులు విడుదల చేశామ‌ని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయ‌న మాట్లాడుతూ ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులందరికీ  విద్య ద్వారా సమాన అవకాశాలు క‌ల్పించేందుకు వారి ఉజ్వల భవిష్యత్ కోసం  ప్రభుత్వం కట్టుబడి ఉంద‌న్నారు. ఒక్క విద్యార్థికి ఓవర్సీస్ నిధులురూ.20 లక్షలు ఇచ్చాం.  ఆవిధంగా ఈ నెల‌లో 2 288 మందికి సుమారు రూ.304కోట్ల నిధులు విడుదల చేశామ‌న్నారు. ఇప్పటివరకు 3642 మంది విద్యార్థులకు రూ.463 కోట్లు విడుదల చేశామ‌న్నారు. 2022 నుంచి ఈ రోజు వరకు బకాయిలను విడుదల చేశామ‌న్నారు.  అర్హత కలిగిన విద్యార్థులకు నేరుగా వారు బ్యాంకు ఖాతాల్లో డబ్బు జ‌మ‌వుతుంద‌న్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తున్న మన విద్యార్థులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించి ఓవర్సీస్ స్కాలర్ షిప్ నిధులను విడుదల చేశామ‌న్నారు.యూకే ,అమెరికా యూరప్ ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మా ప్రభుత్వం ఊరట కల్పించింద‌న్నారు. సంక్షేమ హాస్టల్స్ లో (ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీ) హాస్టల్స్ తక్షణ ఇబ్బందులను అధిగమించేందుకు రూ.60  కోట్లు విడుదల చేశాం. ఇవి జిల్లా కలెక్టర్లు, సెక్రటరీ పరిధిలో  ఉంచామ‌న్నారు.  సీఎం సహాయ నిధి నుంచి  సంక్షేమ హాస్టల్ పిల్లలకు నిధులు అందించామ‌న్నారు.  మా అధికారులందరూ  సంక్షేమ పాఠశాలలు, హాస్టల్స్ విద్యార్థులకు ఏ సమస్య  ఉన్న తక్షణం పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తున్నారన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి అర్హత ఉన్న వారికే ఇస్తామ‌న్నారు.  ఈ నిధుల విడుదలకు కృషి చేసిన  సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క కు ధన్య వాదాలు తెలిపారు. సమావేశంలో వెల్ఫేర్ స్పెష‌ల్ సీఎస్‌  సభ్యసాచి గోష్, ఎస్ సిడిడి ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీ సెక్రటరీ బుద్ధ ప్రకాష్, కమిషనర్ క్షితిజ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page