NEWS

NEWS

క‌వి చిరునామా క‌విత్వ‌మే…

క‌వి అంత‌రంగంలో క‌మ్ముకుని, అల్లుకుని, విస్త‌రించి, అంత‌ర్లీన‌మై విచ్చుకునే సంకీర్ణ సంక్షోభ సృజ‌న ప్ర‌పంచం క‌విత్వం. లోన నుండి పైకి లాగితే నూత‌న న‌వ్య కాంతి శ‌క్తితో అనుభ‌వధార‌గా క‌విత్వం కురుస్తుంది. దీర్ఘ త‌ప‌స్స‌మాధికి వెళ్లి గొప్ప మాంత్రిక శ‌క్తిని క‌వి క‌విత్వానికి ధార‌పోయ‌క పోతే ఇంత‌టి అజ‌రామ‌ర‌త్వంతో ఆ భావోద్వేగ సాంద్ర‌త హృద‌యాల్లో నిక్షిప్త‌మ‌య్యేదా అన్పిస్తుంది. నిశ్చ‌లంపైకి అక‌స్మాత్తుగా తెగిప‌డిన క‌ల్లోల‌పు అనుభ‌వం క‌విని మాట్లాడించి క‌విత్వాన్ని ప్ర‌వ‌హింప‌జేస్తుంది. అందుకే క‌వి గీసుకొనే వివ‌ర్ణ‌వృత్తం, రాసుకునే క‌న్నీటి ఉత్త‌రం, పూయించుకునే అక్ష‌ర‌వ‌నం, వెతుక్కునే జ్ఞాన‌దిశ, తొడుక్కునే వెన్నెల క‌వ‌చం ఖ‌చ్చితంగా క‌విత్వ‌మే. స్వేచ్ఛాగీతం పాడుకునే క‌వి బంధీ అయ్యేది క‌విత్వ చెర‌సాల‌లోనే. స‌మాజంలోని విభిన్న అంశాల‌ను నిశితంగా ప‌రిశీలించి ఉద్వేగంగా, ఉదాత్తంగా త‌న‌లోని ఆత్మ‌వేద‌న‌ను మ‌ట్టి ప‌రిమ‌ళం పేరిట క‌విత్వీక‌రించి సాహితీ క్షేత్రంలో  పేరొందిన దార్శ‌నిక క‌వి, ఆలోచ‌నాశీలి డాక్ట‌ర్ పెద్దివెంక‌ట‌య్య. త‌న చుట్టూరా ప‌రివృత‌మై ఉన్న సామాజిక స‌ముద్ర‌పు అల‌ల‌పై క‌దిలే బతుకు ప‌డ‌వ‌ల ఎద‌లోతుల్ని క‌డిగి దాహ‌వ్య‌ధ‌ల్ని ఆవిష్క‌రించిన క‌విగా వెంక‌ట‌య్య‌ను ఆయ‌న  క‌వితా సంపుటి మ‌ట్టి ప‌రిమ‌ళం నిలిపింది. జ‌డ‌త్వం నుండి జాగృతి వైపు మ‌నిషి న‌డ‌వాల‌ని బ‌ల‌మైన క‌వితాకాంక్షను వెల్ల‌డిస్తూ ఇప్పుడు వెంక‌ట‌య్య క‌వితా విశ్వ‌వీణ‌ను మ్రోయించారు. అరుణ కిర‌ణాల‌తో విశ్వంభ‌ర‌పైకి విచ్చేస్తాడు వెలుగు కొర‌డాల‌తో పుడ‌మిని మేలుకొలుపుతాడు అని ప్రాచీరేఖ మీద ప్ర‌భ‌వించి క‌ల్ల‌లు, ఎల్ల‌లు ఎరుగ‌ని త‌నంతో  జీవ‌కోటికి ప్రాణాధారంగా మారి వైతాళికుడైన యోగిగా, విశ్వ‌వీణావిష్క‌ర్త‌గా ఆదిత్యుడిని (సూర్యుడు) అభివ‌ర్ణించారు.    ఒక‌నాడు ఇల‌పైన స్వ‌ర్గంగా నిలిచిన త‌న ఊరు మారిన కాల‌మాన ప‌రిస్థితుల‌లో రూపుమారిన తీరును మా ఊరు క‌విత‌లో వేద‌నాభ‌రిత హృద‌యంతో చెప్పారు. శ్ర‌మైక జీవ‌న సౌంద‌ర్యానికి ప్ర‌తీక‌గా ఒక‌నాడు భాసించిన ఊరు ప్ర‌పంచీక‌ర‌ణ ప‌ద‌ఘ‌ట్ట‌న‌తో అస్తిత్వాన్ని కోల్పోయి న‌గ‌రీక‌ర‌ణ‌ను అద్దుకున్న వికృత వైనాన్ని హృద‌య‌ద‌ఘ్నంగా చిత్రించారు. బురుజులు కూలిన చోట మిద్దెలు, మేడ‌లు నింగినంటాయ‌ని, సిందోళ్ల బాగోతం, గొల్ల‌సుద్దులు, క‌మ్మ‌రి కొలిమి, కుమ్మ‌రి చ‌క్రం, సాలెల మ‌గ్గం, దొర‌గ‌డీలు, శాద‌బాయిలు, ఇసుర్రాయిలు, అల‌నాటి అమ‌రుల త్యాగాల జాడ‌లు, అమ్మ మ‌న‌స్సున్న అప్ప‌టి మ‌నుషులు పూర్తిగా క‌నిపించ‌కుండా  క‌నుమ‌రుగైపోగా ఊరుకు వింత‌పోక‌డ అంటుకొని అప్ప‌టి గొప్ప‌తనం  ఆకాశంలో క‌లిసిపోయింద‌ని ఎంతగానో  కుమిలిపోయారు. అల‌వోక‌గా గుర్తుకొచ్చే బాల్యం నాటి ఊరు జ్ఞాప‌కాలు మ‌ళ్లీ త‌న‌ని ప‌సివాడిని చేస్తున్నాయ‌న్నారు. అక్ష‌రం అంటేనే అభ్యుద‌యం , ప‌చ్చ‌ద‌నం అని అనుభ‌వాల వాహినిగా, బ‌తుకుకు వెలుగు రేఖ‌గా అన్వ‌యించి మాన‌స‌వీణ అన్న క‌విత‌లో చెప్పారు. మాన‌వ ప్ర‌కృతిని ముడివేసి మాన‌వీయ రాగ బంధాన్ని ఆవిష్క‌రించే అనుసంధాన సాధ‌క‌మే అక్ష‌ర‌మ‌ని తెలిపారు. ఆధిప‌త్య యుద్ధకాంక్షాదాహాన్ని నిర‌సించారు. అన్యాయంపై గెల‌వాల‌న్న యుద్ధ సంక‌ల్పం ఎంతో గొప్ప‌ద‌ని భావించారు. బ‌హుజ‌న ఫిరంగిగా, దౌర్జ‌న్యంపై మండిన భాస్వ‌రంగా, ఆదిరుద్ర‌మూర్తిగా, అభిన‌వ చాణిక్యుడుగా, త్యాగాల‌కే తిల‌కంగా స‌ర్దార్ స‌ర్వాయిపాప‌న్న‌ను ధీరోదాత్తునిగా చిత్రించారు. పాప‌న్న స్ఫూర్తితో  పోరాడి తుది విజ‌యాన్ని బ‌హుజ‌నులు పొందాల‌ని పిలుపునిచ్చారు. చెమ‌ట చుక్క‌ను మెరుస్తున్న ఆణిముత్య‌మ‌న్న గొప్ప భావ‌న‌ను మారుక‌త్తి క‌విత‌లో ప్ర‌క‌టించారు. ఎవ‌రి మోచేతి నీళ్లు నీకెందుకు ? ఎవ‌రి బాకా భ‌జంత్రి నీకెందుకు ? అన్న వాక్యాల‌లో వెంక‌ట‌య్య క‌వితా దృక్ప‌థం సుస్ప‌ష్టంగా వ్య‌క్తమైంది. నిన్ను నువ్వు తెలుసుకొని, కావ‌ల‌సినంత‌గా ప‌దును పెట్టుకుని స‌రికొత్త శ్రేయో రాజ్యాన్ని ఆవిష్క‌రించ‌మ‌ని అన‌డంలో మార్పును ఆశించే ప‌రిణామశీల‌త దండిగా క‌లిగిన మేటి క‌విగా ఆయ‌న క‌న్పించారు. ప‌ల్లె ప‌ట్నానికి వ‌ల‌సపోతుంటే  తెలంగాణ త‌ల్లి గుండె ఎంతో త‌ల్ల‌డిల్లిపోయింద‌ని అన్నారు. ప‌ల్లెల బ‌తుకు చిత్రాలను చిధ్ర‌మ‌వ‌కుండా గుండెగూటిలో పెట్టి ప‌దిలంగా కాపాడ‌మ‌ని వేడుకోవ‌డంలో గ్రామ సీమ‌ల‌తో క‌వికి ఉన్న అమూర్తమైన  అవ్యాజ‌మైన అనుబంధం వ్య‌క్తమైంది. స్వాంత‌న మూర్తిగా, మ‌హాద్భుత శ‌క్తిగా ఆకాశంలో స‌గం క‌వితలో స్త్రీ మూర్తిని చిత్రిస్తూ మ‌హిళాభ్యుద‌య‌మే దేశ సౌభాగ్య‌మ‌ని వెల్ల‌డించారు. క‌న్నెర్ర‌జేసిన ఎర్ర‌జొన్న క‌విత మ‌ట్టిని ముద్దాడిన చెమ‌ట చుక్క‌ల పొలికేక‌ల ఆర్త‌నాదాల్ని అద్భుతంగా  వ్య‌క్తీక‌రించి ఎర్ర‌గుండెల్లో మండిన నిప్పుక‌ణికల హోరును ప్ర‌త్య‌క్షంగా చూపింది. మ‌తం గితం వ‌ద్ద‌ని మాన‌వ‌త్వ‌మే మ‌నిషికి అతిపెద్ద‌ అభిమ‌త‌మ‌ని క‌విగా వెంక‌య్య‌ హిత‌వు ప‌లికారు. నా హృది పారే ఒక న‌ది అని పాల్కురిని, బమ్మెర‌పోత‌న, శ్రీ‌నాథుడు, శ్రీ‌శ్రీ‌, విశ్వ‌నాథ‌, జాషువా, కాళోజి, దాశ‌ర‌థి, సినారె, శేషేంద్ర‌, ఆరుద్ర‌, సోమ‌సుంద‌ర్, తిల‌క్ వంటి నాటి క‌వుల‌ను, నేటి వ‌ర్త‌మాన క‌వితాప్ర‌పంచ‌పు నిప్పుర‌వ్వల‌ను ఎంతో ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు. ఎడారి తోడేళ్ల‌ను చూసి గుండెల‌విసేలా చెట్లు ఏక‌ధాటిగా క‌న్నీళ్లు పెట్టాయ‌న్నారు. అమెరికాలోని శ్వేత‌సౌధం జాత్య‌హంకారాన్ని విడిచి స‌మ‌తాస‌ద‌నంగా మారాల‌ని…

మరువని త్యాగానివి

ఛాందస సమాజాన్ని అర్థంపర్థంలేని ఆచారాలతో ఆడవాళ్ళు అబలలని వంటింటికుందేళ్ళుగా చూసే నాటి సమాజ మనస్తత్వాన్ని నీచత్వాన్ని పగులగొట్టి మహిళలందరినీ మార్చే సరస్వతి రూపానివైనావు నాటి ప్రతికూల పరిస్థితుల్లో ఆడవాళ్ళంటే ఆదిపరాశక్తులని ఎంతో గుండెనిబ్బరంతో అవమానభారన్ని ఎదిరించిన ఓర్పుశిఖరానివైనావు దురాచారాల్ని దునుమాడే దేవతామూర్తివైయ్యావు కుళ్ళిన సమాజంలోని కంపునంతా తరిమి జ్ఞానపరిమళాల్ని వెదజల్లావు గడపదాటిన నీ అడుగు నింగినితాకే…

తాజా ఆకలి ఖర్చులకే…

జీవితంలో ఒక్కసారే కాలమిచ్చే అరుదైన గౌరవాన్ని ఎదురెల్లి అందుకునే ఆనందం . నేరుగా ఏదో ఇవ్వాలనే దాగాకుండా ఉండాలనే ఇష్టమైన కోరికలో ఓ అవకాశం రూపంలో కొద్దీ పరీక్షలాంటి ముసురులో కూడా కనిపించని వెచ్చదనాన్ని దాచి గుండె గుబులుకి గుప్పెటనిండా కబుర్ల చిరుతిండ్లను రుచిగల చూపుల్లో నంజుకునే ఆ ప్రత్యేక సమయం తాజా ఆకలి ఖర్చులకే……

ఠాకూర్‌ ఔట్‌… ‌థాక్రే ఇన్‌

‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా ఉన్న మాణిక్యం ఠాకూర్‌ ‌స్థానంలో కొత్తగా మాణిక్‌రావు థాక్రేను ఇన్‌చార్జీగా నియమించింది ఏఐసీసీ. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించినప్పటినుండీ ఆ పార్టీలో అంతర్గత కలహాలు మొదలైనాయి. దశాబ్ధాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లను కాదని,…

కలెక్టరేట్‌ ‌వద్ద కొనసాగుతున్న రైతుల ఆందోళన

కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి5: కలెక్టరేట్‌ ‌వద్ద రైతుల ధర్నా కొనసాగుతోంది. కలెక్టర్‌ ‌స్పందించే వరకు ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాత్రి కూడా ధర్నా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. సమస్య పరిష్కరించే వరకు అక్కడి నుంచి కదిలేదిలేదని బీష్మించుకున్నారు. కలెక్టర్‌ ‌బయటకు వచ్చేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మూడు పంటలు పండే పొలాల్లో ఇండస్టీల్రు పెడతారా అని రైతులు…

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌కు నిరసన సెగ ..

పెద్ద ఎత్తున ఆందోళన..రైతు రాములు ఆత్మహత్యపై భగ్గుమన్న జనం కలెక్టరేట్‌కు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు పోలీసలతో తోపులాటతో ఉద్రిక్తత..ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలన్న బిజెపి కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి5: కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌తో పాటు,రైతు రాములు ఆత్మహత్యతో భగ్గుమన్న ప్రజలతో కలెక్టరేట్‌  ‌దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యువ రైతు రాములు ఆత్మహత్యకు నిరసనగా పెద్ద ఎత్తున రైతులు కలెక్టరేట్‌…

మత విద్వేషాలతో లబ్ధికి కుట్ర

మెటుపల్లి, ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర జనవరి5 : బిజెపి నేతలు కుట్రలు, కుతంత్రాలు, మత కలహాలు సృష్టిస్తూ ప్రజల మధ్య వైరుధ్యాలను సృష్టిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌తెలంగాణ ప్రజల బతుకు దెరువు కోసం ఆరాట పడుతూ తెలంగాణ ప్రజల పేగు బంధంగా ఉందని అన్నారు.…

పంచాయతీ నిధులు స్వాహా చేసిన ఘనులు

అప్పుల్లో కూరుకు పోయిన తెలంగాణ రాష్ట్రం సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి5: పంచాయతీలకు కేటాయించిన కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం గంటలోనే పక్కదారి మళ్లించిందని తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శలు చేశారు. పంచాయితీలను బలోపేతం చేసేందుకు ప్రధాని మోడీ నేరుగా నిధులు జమచేస్తే వాటిని…

‌ప్రగతిభవన్‌ ‌ముట్టడికి బిజెవైఎం యత్నం

అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు కలవడానికి వెళితే అరెస్టులా..‘బండి’ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి5: ప్రగతి భవన్‌ ‌వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ ‌వద్ద ధర్నా చేపట్టారు. ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తప్పుగా ఇచ్చిన…

కాంగ్రెస్‌తో బిఆర్‌ఎస్‌ ‌పొత్తు ఉండదు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి5: కాంగ్రెస్‌ ‌పార్టీతో బీఆర్‌ఎస్‌ ‌పొత్తు ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. 2023లో అతిపెద్ద జోక్‌ ఇదేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒం‌టిరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పోలవరం విషయంలో సీఎం కేసీఆర్‌ ‌విశాల దృక్పథంతో పనిచేస్తారని తెలిపారు.…