మహా అక్షరం శ్రీ శ్రీ
ఆ కలం కాలాన్ని గురిచూస్తు ప్రశ్నించే ఆయుధం….. ఆ భాష గుండెలో రక్తాన్ని ఊగించే ఆవేశం….. ఆ అక్షరం చీకటిలో అగ్గిలా వెగిలే పోరాటం…. ఆ కవితే తెలుగు నుదుట ఓ ప్రస్థానం… ఆ కవిదే ఆంధ్రుల పాలిట మహాప్రస్థానం…. ఆ జయభేరే ఆధునికతకు నీడలా మొలిచి గెలిచిన సిద్దాంతం.. అతడే మహా కవితకు శ్రీకారం…
