NEWS

NEWS

బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ భరోసా

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే కెసిఆర్ భరోసా పథకాలు అమలవుతాయని కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు మండలంలోని మంగళపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి అసెంబ్లీకి పంపాలని…

ఒక్క అవకాశం ఇవ్వండి  మీ సమస్యలను తీరుస్తా

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 14: మన ఓట్లను మనమే వేసుకొని పాలకులమవుదామా లేదంటే మన ఆత్మ గౌరవాన్ని హేళన చేస్తూ మన ఓట్లతో లబ్ది పొందుతున్న పాలకుల కు బానిసలుగా ఉందమా తేల్చుకునే సమయం ఆసన్నమైందని పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారం  బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో…

ఒక్క అవకాశం ఇస్తే కల్వకుర్తిని అభివృద్ధి చేసి చూపిస్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలందరికీ సేవకుడిగా పని చేస్తానని కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి అన్నారు. తలకొండపల్లి మండలంలోని   చంద్రదాన, అంతారం , వెంకటాపూర్, జూలపల్లి గ్రామాలలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు గ్రామాలకు వచ్చిన…

బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే బేతి ముఖ్య అనుచరులు

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 14:  ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అనుచరులు మంగళవారం టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఎమ్మెల్యే బేతి ముఖ్య అనుచరులుగా ఉంటున్న పలువురు నేతలు గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు..ఎమ్మెల్యే బేతి,…

ఉప్పల్ బీఆర్ఎస్ కు భారీ జట్కాఉప్పల్లో  బి ఆర్  ఎస్ పార్టీ  నుండి  కాంగ్రెస్ లోకి భారీ చేరిక‌లు

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 14:  ఆరు నూరైనా ఉప్ప‌ల్ లో ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి గెలుపును ఆప‌టం ఎవరి త‌రం కాద‌ని, యువ నాయ‌కుడు ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి గెలుపు కోసం  15రోజులు  రాత్రి పగలు క‌ష్ట‌ప‌డాలని  పిసిసి అధ్యక్షులు  రేవంత్ రెడ్డి  అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కాంగ్రెస్…

ఒకరి మృతికి కారణమైన ద్విచక్ర వాహనదారుడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన కోర్టు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాపూర్ గేట్ సమీపంలో ఒకరి మృతికి కారణమైన ద్విచక్ర వాహన దారుడికి తొమ్మిదవ ఎల్బీనగర్ సెషన్ కోర్టు న్యాయమూర్తి హరీష రెండు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 6500 జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. దీనికి సంబంధించి ఆమనగల్లు ఎస్సై బలరాం తెలిపిన…

నిరుపేదలకు సేవ చేయటం లోనే ఆనందం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : నిరుపేదలకు సేవ చేయడంలోనే ఎంతో ఆనందం దాగి ఉందని కడ్తాల్ జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. కడ్తాల మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం బీద ప్రజలతో…

మరోసారి గెలిపించండి సేవకుడిగా ఉంటా

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్‌ 14 : చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు తనను మరోమారు ఆశీర్వదిస్తే అభివృద్ధి కొనసాగిస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.మంగళవారం చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల, నవలయపల్లి,వెంకన్నగూడ, హస్తేపూర్‌,అంతారం,కుమ్మెర,మల్కాపూర్‌ గ్రామాల్లో జోరుగా బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎన్నికల ప్రచార వాహనంపై రోడ్‌ షోలో మాట్లాడుతూ…గతంలో పాలించిన కాంగ్రెస్ అభివృద్ధి…

ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి

సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 14: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల తో  సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు…

నిరుపేదకు చేయూతనందించిన కసిరెడ్డి మాధవి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ కాలనీ..  ఆమనగల్లు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన నిరుపేద మహిళలకు కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి సతీమణి మాధవి రెడ్డి పండ్ల షాపు పెట్టించి ఆదుకున్నారు. పేద ప్రజలకు బాసటగా నిలిచారు.  అనంతరం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం…