శాంతి కాముకుడు సరిహద్దు గాంధీ

ఖాన్ అబ్దుల్ గఫర్‌ఖాన్…. ఈ పేరును ఈ తరానికి చెందిన చాలా మంది విని ఉండక పోవచ్చు. కాని సరిహద్దు గాంధీ అంటే కొంతమందికి అయినా గుర్తుకు రావచ్చు. పాకిస్థాన్‌లోని పంఖ్తూన్ రాష్ట్రంలో ఒక పఠాన్‌గా జన్మించి, జాతిపిత గాంధీ అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు…








