నాందీ వాచకం

రంగులన్నీ ఏకమై మనుషులందరూ ఒక్కటై కులమతభేదాలు మరచే సమానత్వపు సంబరాల రంగుల పండగ హోళీకి స్వాగతం అనురాగఆప్యాయతలకు ఆలవాలమై, ఆనందాలను మనసులలో నింపుతూ వ్యక్తినిర్మాణాన్ని చెక్కుకొనే సంస్కృతిని ప్రతిబింబించే పర్వమిది. ప్రగతి శత్రువులైన ‘‘ఉచితాల’’ ప్రజాస్వామ్య కంటకాలైన ‘‘నిరంకుశ విధానాల’’ పీడ కామదహనంలా, మంటల్లో కాలి బూడిదైన ‘‘హోళి’’కలా, రాబోయే రోజుల్లో విరగడవ్వడానికి ఊరూ,వాడా నడుంబిగించాలి.…








