వెనుక ఎంతపెద్దవారున్నా చర్యలు తప్పవు
సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: మహాన్యూస్ ఛానల్ కార్యాలయంపై బీఆర్‌ఎస్ మూకల దాడిని ంవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఇది అమానుష చర్య అని పేర్కొన్నారు. మీడియా సంస్ధల కార్యాలయాలపై భౌతిక దాడులకు పాల్పడడం, విధ్వంసం సృష్టించడం దారుణమని, ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షాన, ప్రభుత్వం తరపున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సంస్ధలు, వ్యవస్దలపై పెయిడ్ ఆర్టిస్ట్ లతో ఈవిధంగా దాడులు చేయించడం ప్రజాస్వామ్యంలో సరైనదికాదని స్పష్టం చేశారు.. పార్టీ పరంగా ఛానల్స్ నిర్వహిస్తున్న వారు పెయిడ్ ఆర్టిస్ట్‌లతో ప్రజాస్వామ్యానికి విరుద్దంగా పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తూ ప్రభుత్వంపై ఇష్టమొచ్చిన రీతిలో బురద జల్లుతున్నారని విమర్శించారు. నిజాన్ని నిర్బయంగా అధికార పక్షమనో, ప్రతిపక్షమనో తేడా లేకుండా ధైర్యంగా వార్తలు ప్రసారం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడికి పాల్పడి హత్యాయత్నానికి ప్రయత్నించిన వారి వెనుక ఎంతటి పెద్దవారున్నా వదిలిపెట్టేదిలేదని, దోషులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.