రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రదానం
అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూదిల్లీ, ప్రజాంతంత్ర, జనవరి 17 : పారిస్ పారాలింపిక్స్ పతక విజేత, తెలంగాణ ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము దీప్తికి అవార్డు ప్రదానం చేశారు. తెలంగాణలోని వరంగల్? జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి.. 2024లో పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్?లో బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.
400 మీటర్ల టీ20 విభాగం ఫైనల్స్?లో 55.82 సెకన్‌లలో రేస్?ని కంప్లీట్ చేసి దీప్తి కాంస్య పతకం కొల్లగొట్టింది. తద్వారా పారాలింపిక్స్?లో ఇంటలెక్చువల్ ఇంపెయిర్మెంట్ విభాగంలో భారత్?కు తొలి ఒలంపిక్ మెడల్ సాధించిన అథ్లెట్?గా దీప్తి జీవాంజి రికార్డ్ క్రియేట్ చేసింది. అంగవైకల్యాన్ని ధైర్యంగా జయించి.. విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిరచిన దీప్తికి 2024 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డ్ ప్రకటించింది. శుక్రవారం (జనవరి 17) రాష్ట్రపతి భవన్?లో అవార్డుల ప్రధానోత్స కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలోనే దీప్తి అవార్డు అందుకుంది.
రేవంత్ రెడ్డి అభినందనలు
అర్జున అవార్డు అందుకున్న దీప్తి జీవాంజికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో దీప్తికి సీఎం రేవంత్ రెడ్డి అభినందలు తెలిపారు. ‘‘రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్న మన తెలంగాణ క్రీడారత్నం, వరంగల్ ముద్దుబిడ్డ, పారా ఒలింపియన్ అథ్లెట్ దీప్తి జీవంజికి అభినందనలు. తెలంగాణ నుంచి మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించేలా మెరుగైన స్పోర్ట్స్ పాలసీతో ప్రజా ప్రభుత్వం ముందుకుపోతుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.