హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బీసీ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్)-2027 ఉచిత శిక్షణ కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కోచింగ్ 2026 ఆగస్టు 24 నుంచి 2027 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. మొత్తం 150మంది అభ్యర్థులకు శిక్షణ అందించనుండగా అందులో వందమంది ఓపెన్ కేటగిరీ ద్వారా 50మంది తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ప్రిలిమ్స్ అర్హత పొందిన అభ్యర్థుల నుంచి ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు కల్పించే సౌకర్యాలు
నెలకు రూ.5,000 స్టయిఫండ్(నిబంధనల మేరకు), ఒకేసారి రూ.5,000 పుస్తక భృతి, గ్రంథాలయ సౌకర్యం, నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ, స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు, మార్గదర్శకత్వం.
అర్హతలు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. కుటుంబ వార్షిక ఆదాయం. గ్రామీణ ప్రాంతం వారికి రూ.1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంతం వారికి రూ.2 లక్షల లోపు. భారతీయ పౌరుడై తెలంగాణ నివాసి ఉండాలి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభం: 15-7-2026, ఆన్‌లైన్ దరఖాస్తులు 17-7-2026 నుంచి 7-8-2026 వరకు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్: 13-8-2026 నుంచి, స్క్రీనింగ్ టెస్ట్: 16-8-2026, ఫలితాలు: 19-8-2026, ధ్రువపత్రాల పరిశీలన: 21-8-2026 నుంచి తరగతుల ప్రారంభం: 24-08-202.
ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ విజ్ఞప్తి కోరారు.




