కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

– ఇంట్లో ఫ్రస్టేషన్‌ను బయట చూపిస్తే ఎలా?
– కేటీఆర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే సామేల్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: సోదరి కవిత ఎందుకు పొలిటికల్ పార్టీ పెట్టారో కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు రేగు కంపలాగ కవిత తగిలారని వ్యాఖ్యానించారు. గాంధీ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌పై కేటీఆర్, కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.  ఇంట్లో ఫ్రస్టేషన్‌ను బయట ఎందుకు చూపిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పదేళ్ల బీఆరఎస్ పాలనలో ఏం చేశారని కవిత అడుగుతున్నారని, ముందు ఆమెకు సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు ఆయన స్పష్టం చేశారు. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేదని కవిత అంటున్నారని, నిజంగానే ప్రమేయం లేకుంటే తీహార్ జైలుకు ఎందుకు వెళ్లారో చెప్పాలని ఆమెను ప్రశ్నించారు. అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లిని కాదని కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తు చేసిన సామేల్ దీని వెనక ఉన్న రహస్యమేంటో చెప్పాలని కవితను ప్రశ్నించారు. ఇంటి పోరుతో ఇబ్బంది పడుతున్న మీరు మంది జోలికి ఎందుకు పోతున్నారంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎవరూ గుర్తుపట్టట్లేదని కేటీఆర్ అంటున్నారని, కేటీఆర్‌ను గుర్తుపట్టే స్థలాలు తనకు బాగా తెలుసునని సామేల్ వ్యాఖ్యానించారు. గుంట నక్కలు, తోడేళ్ళు అందరూ మీ వద్దనే ఉన్నారంటూ కేటీఆర్‌పై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీని కదిలించే దమ్ము ఎవరికీ లేదని సామేల్ స్పష్టం చేశారు. ఆర్టీసీని ఆగం చేయాలని చూశారని, కానీ వారి కుట్రలు ఫలించలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆరఎస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *