– ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా అదనపు కలెక్టర్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: తెలంగాణ ప్రభుత్వంమరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లని ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లు గా నియమిస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ పదవి రద్దు చేసి.. కొత్త బాధ్యతలని అదనపు కలెక్టర్లకు అప్పగించింది. ఈ క్రమంలో అడవి భూసర్వే, హక్కుల నిర్దారణ, సెటిల్‌మెంట్ పనులు వీరి పరిధిలోకి రానున్నాయి. 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టస్ పర్యవేక్షణలో అమలు చేయనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





