– వాటాలు పంచుకున్న ముఖ్య నేత, మరో మంత్రి
– లాటరీ పద్ధతిన ఎందుకు కేటాయించరు?
– లిక్కర్ కంపెనీలకు రూ.4500 కోట్ల బకాయిలు
– చరిత్రలో ఎన్నడూ లేదు
– రైతులకంటే బీరు కంపెనీలే ప్రభుత్వానికి ముఖ్యం
– విరుచుకుపడ్డ హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: అబ్కారీ శాఖలో అవినీతి జరుగుతున్న సంగతిని బయటపెట్టామని బీఆర్ ఎస్ నేత హరీష్‌రావు అన్నారు. తాము బయట పెట్టిన మరో అవినీతి బాగోతం ఇదని ఆయన అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ 110అప్లికేషన్లు వచ్చాయి.110అప్లికేషన్లలలో 25ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.మంత్రి కోటా కింద నాలుగు, ముఖ్య నేత కోటా కింద 21 ఎంపిక చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా25 మొదట ఇస్తారట..ఈ మధ్య ముఖ్య నేతకు తోడై, నీడై,ఇంట్లోనే ఉంటాడు ఆ నాయకుడు. ఈ మధ్య వార్తల్లో ఉన్నారు. కారు నేరుగా ముఖ్య నేత ఇంట్లోకి వెళ్తుంది.ఈ మధ్య ఆ ముఖ్య నేత తిరుపతి వెళ్తే కూడా వెంటే ఉన్నాడు. ఒక్కొక్క బ్రివరికి ఒక్క కోటి 80 లక్షల ధర నిర్ణయించారు. ఒకటిన్నర ముఖ్యనేతకు,మిగతా 30 లక్షలు తోడు నీడ కు. 21 వీరిద్దరూ ఫైనల్ చేసుకున్నారు, మరో నాలుగు 4మంత్రి ఫైనల్ చేసుకున్నారు. 110అప్లికేషన్లు వచ్చాయి అంటున్నారు కదా, వైన్స్ లకు లాటరీ తీసినట్టు ఎందుకు లాటరీ తీయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనివిధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకురూ. 4500కోట్లు బకాయిలు పడ్డారు. కొన్ని బకాయిలు 16నెలలకు పైబడి ఉన్నాయి.చరిత్రలో ఎన్నడు కూడా ఈ విధంగా లేదు.బిఆర్ ఎస్ ప్రభుత్వం ఆయంలొ 15రోజుల్లో చెల్లింపులు చేసేవాళ్ళం. దీని వలన బ్రీజర్ సరఫరా ఆగిపోయిందన్నారు. రాష్ట్రంలో చాలా షాప్ లలో సరుకు లేదు.ఇతర మల్టీ నేషనల్ కంపెనీ లు కూడా సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించాయి. లేఖలు కూడా రాశారు. వాటాలు పంపకాల్లో తేడాతోనే బకాయిలు నిలిచిపోయాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో మరికొన్ని బ్రాండ్స్ నిలిపివేసే పరిస్థితి ఉన్నది. దీనితో ప్రభుత్వం ఆదాయం పడిపోతోంది.ఇప్పటికే హాలోగ్రామ్ టెండర్లు విషయంలో ముఖ్య నేత అల్లుడికి,మంత్రి కొడుక్కి కావాలని పట్టుపట్టడంలోఈ ప్రభుత్వం బీర్ కంపెనీ లకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదన్నారు. మీకు బిర్ల కంపెనీ లు ముఖ్యమా…రైతులు ముఖ్యమా అంటే బీరు కంపెనీ లు ముఖ్యం అంటున్నారు. మెదక్ జిల్లా సింగూరు డ్యాం రిపేర్ పేరు మీద రైతులకు క్రాఫ్ హాలిడే ప్రకటించారు.సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు కింద. 40వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు.మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్ట కింద 30వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు.కానీ సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎలాంటి ఆటంకం లేకుండా బీరు కంపెనీ లకు నీటి పంపిణీ చేస్తుంది.ఇది మద్యం తయారీ దారు ప్రభుత్వమా…రైతు ప్రభుత్వమా, అని ప్రశ్నించారు. అబ్కారీ శాఖ స్పెషల్ సిఎస్ సంగారెడ్డి జిల్లాకు వెళ్లి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం అయి రైతులకు నీరు సప్లై ఆపేయండి.బీరు కంపెనీ లకు నీటి కొరత రాకుండా చూడండని ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





