చిలుకూరు పేరు తెలియని వారుండరు. చిలుకూరు బాలాజీ లేదా శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధమైంది. తిరుమల అంతటి ఐశ్వర్యవంతమైన ఆల యం కాకపోవొచ్చు. కాని మహా మహిన్వితమైన ఆలయంగా చిలుకూరు బాలాజీ మందిరానికి పేరుంది. ఈ నెల 7వ తేదీన చిలుకూరు ప్రధాన పూజారి రంగరాజన్ పై దాడి జరిగింది. రామరాజ్యం అనే పేరుతో ఒక సంస్థను స్థాపిం చిన వీర రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో అనుచరులు ఈ దాడికి తెగబడ్డారు. ఈ వీర రాఘవ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా వాడంటారు. సమాజంలో దురాచారాలు నిర్మూలించేందుకు రామరాజ్యం స్థాపించేందుకు రామ రాజ్యం స్థాపించినట్లు సంస్థాపకులు వీర రాఘవ రెడ్డి చెబుతున్నారు. 2022 లో వీర రాఘవ రెడ్డి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అంతటితో ఆగలేదు. దళ సభ్యులను కూడా రిక్రూట్ చేశారు. రామరాజ్యం ఆర్మీ రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు.
ఐదు వేల మంది సైన్యం లేదా దళ సభ్యులను రిక్రూట్ చేయబోతున్నట్లు వ్యవస్థాపకులు ప్రకటించారు. భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 7,8 శ్లోకాలు, 17వ చాప్టర్ లోని 17, 43 శ్లోకాలలో పేర్కొన్నట్లు దుష్టశిక్షణ, శిక్ష రక్షణకు పాటుపడతామని రామరాజ్యం ప్రతిజ్ఞ కూడా చేసింది. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు లేదా ఫెయిలైన వారు రామ రాజ్యం ఆర్మీలో చేరేందుకు కనీస అర్హతగా నిర్ణయించారు. మొదటి విడతగా దాదాపు ఐదు వేల మందిని నియమిస్తామని ప్రకటించారు. భగవద్గీత శ్లోకాలు చెప్పినట్లుగా తూచా తప్పకుండా నియమాలను పాటించేవారు అర్హులని పేర్కొన్నారు. ఐదు కి.మీ నడిచే శక్తి లేదా కనీసం 2 కి.మీ నడిచే సత్తా ఉండాలి. భగవద్గీత, రామాయణం పట్ల ఆసక్తి, శ్రద్ధ ఉండాలి. కనీసం 20 సంవత్సరాల వయసు ఉండి, గరిష్టంగా 50 సంవత్సరాలు ఉండాలి. నెలకు వేతనం 20 వేల రూపాయలు ఇస్తారు.
పైగా ఉచితంగా భోజనం, వసతి సదుపాయాలను కల్పిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులను తమ వివరాలను నమోదు చేసుకోవాలని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 మధ్య గడువును పెట్టారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రూ.350 చెల్లించాలనే నిబంధనలు ఉంచాలి. ఈ వివ రాలను తమ వెబ్సైట్లో రామారాజ్యం వ్యవస్థాపకులు పొందు పరిచారు. ఆర్మీలో చేరాలనుకునే వారు ఇక్ష్వాకులు, భరత వంశానికి చెందిన వారై ఉండాలి. పైగా వీరు క్షత్రియులై ఉండాలి.
తెలంగాణలోని అనేక ఆల యాల్లో పనిచేసే పూజా రులను రామరాజ్యం సంప్రదించింది. పూజారులు ఈ గోత్రాలకు చెందిన వారిని గుర్తించి, వారి వివరాలు సేక రించి తమకు తెలియచేయాలని రామరాజ్యం నిర్వాహకులు కోరారు. దేవాలయంలో సందర్శ నకు వొచ్చిన వారు తమ గోత్రాలను తెలియచేసే సమయంలో పూజారులు వారిని గుర్తించాలి. కాగా వీర రాఘవరెడ్డి గ్యాంగు పెట్టిన షరతు లను, మాటలను చిలుకూరు బాలాజీ మందిర్ పూజారి ఖాతరు చేయలేదు. తమ పరిధిలోకి రాని అంశమని, రామరాజ్యం గ్యాంగ్ డిమాండ్‌ను తోసిపుచ్చారు. తమ మాటను ఖాతరు చేయనందుకు వీర రాఘవ రెడ్డి గ్యాంగ్ పూజారి రంగరాజన్ పైన ఇంట్లో దాడి చేసి దౌర్జన్యం చేశారు. ఈ దారుణమైన ఘటన ఈ నెల 7వ తేదీన జరిగి ంది. తాము రాజ్యాంగానికి, దైవ త్వానికి మాత్రమే కట్టుబడి ఉంటామని అంతే కాని రామరాజ్యం ముసుగులో ఉన్న అరా చక మూకను ఖాతరు చేయమని సౌందరరాజన్, రంగరాజన్ తెగేసి చెప్పారు.
రామరాజ్యం వ్యవస్థాపకుడు అని చెప్పుకుంటున్న వీర రాఘవ రెడ్డి న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థను కూడా ఖాత రు చేసే ప్రసక్తి లేదని, అవసరమైన ఈ వ్యవస్థలపై తిరుగు బాటు చేస్తామని బెదిరిస్తూ ప్రకటన చేశారు. సమాజంలో జరుగుతున్న అన్ని రకాల అరాచకాలకు ఈ రెండు వ్యవస్థలు కారణమని కూడా నిందారోపణ చేశారు. రామరాజ్యం తమ అజెండాలో న్యాయ వ్యవస్థ 340 సీఆర్పీసీ లోని అంశాలు ( 379 బీఎన్‌ఎస్‌ఎస్)ను పట్టించుకో వడం లేదని, దేవాలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గోహత్యలు నిత్య కృత్యమయ్యాయని, సామాన్య మానవుడు తీవ్రమైన దాడికి లోనవుతున్నారని, దీనికి ఈ వ్యవస్థలే కారణమని రామ రాజ్యం తన అజెండాలో పేర్కొంది. న్యాయ వ్యవస్థ నేరగాళ్ల కొమ్ముకాస్తోందంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వాలు వీటిని పట్టించుకోవడం లేదన్నారు. నేరగాళ్లను న్యాయ వ్యవస్థ రక్షిస్తుంటే, మనకు ఈ సమ స్యను పరిష్కరించేందుకు అధికారం ఉంది. భగవద్గీతలో చెప్పినట్లుగా ధర్మ పరి రక్షణకు, ధర్మ శాస్త్రాల్లో చెప్పినట్లుగా శిక్షలు విధించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఈ భాగోతం ఈ రోజు వొచ్చిందేమీ కాదు. 2022 నుంచి కొనసాగుతోంది. వెబ్సైట్లో పోస్టు చేసిన వీడి యోలు చూస్తే, ధర్మ పరిరక్షణకు రామ రాజ్యంలో చేరి ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉంటామని కూడా ఈ సంస్థ పేర్కొంది. ఆంధ్ర, తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రులు కూడా చీడపురుగులు, అరాచక శక్తులని రామ రాజ్యం పేర్కొంది. వీరిద్దరిని అరెస్టు చేసి తిరుపతికి తీసుకెళ్లి శిక్షలు విధించాలని కూడా రామరాజ్యం పేర్కొంది. గత మూడేళ్లుగా రామరాజ్యం పనిచేస్తున్నా, ఎవరికి తెలియదు. ఈ సంస్థ దుష్ట కార్యక్రమాలు ఎవరి కంట పడలేదు. చిలుకూరు గుడి పూజారి పై దాడి జరగడంలో రామరాజ్యం భాగోతం రచ్చ రచ్చగా మారింది. పూజారిపైన దాడి వల్ల రామరాజ్యంకు పెద్ద ఎత్తున ప్రచారం వొచ్చింది. అనేక మంది యువకులు రామరాజ్యంలో చేరారు. వీరు నల్లటి దుస్తులు, కాషాయం రంగు తలపాగా చుట్టుకుని కనపడుతారు. ఇక పోలీసు దర్యాప్తు వేగవంతమైంది. తదుపరి విచారణలో ఎన్ని రహస్యాలు, కార్యకలాపాలు బహిర్గతమవుతాయో…!?
– శ్యామ్ కుమార్