ఉక్రెయిన్‌ పట్ల తగ్గుతున్న అమెరికా ప్రాధాన్యత!?

  • ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా డెడ్‌లైన్‌ని  దాటిన అమెరికా
  •  అణ్వస్త్ర ప్రయోగానికి మార్గం సుగమం అవుతోందా?  

రష్యా రెడ్‌ ల్కెన్‌ని ఉక్రెయిన్‌ యుద్ధంలో  అమెరికా దాటింది. రష్యా భూభాగంలోకి దీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగించేలా ఉక్రెయిన్‌కి  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి.. పంచాయితీని పరాకాష్టకు చేర్చింది. ఉక్రెయిన్‌ ఇప్పటికే ఈ తరహా క్షిపణులను రష్యా భూభాగంలోకి ప్రయోగిస్తోంది. దీనికి రష్యా స్పందన ఎలా ఉండబోతోందనేదే ఇప్పుడు ప్రశ్న. తాజా పరణామాలతో సంక్షోభం మరింత ముదిరి యావత్‌ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా.. దాని పశ్చిమ మితృలు తాను గీసిన గీత దాటితే అణ్వస్త్ర ప్రయోగానికి కూడా వెనకాడనని రష్యా అధినేత పుతిన్‌ హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే, పశ్చిమ దేశాలు ఈ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ వొచ్చాయి. శాంతి స్థాపనకు చిత్తశుద్ధితో ప్రయత్నించక పోగా …ఉక్రెయిన్‌ కు విచ్చలవిడిగా మిలటరీ సాయం అందిస్తూ ఉక్రెయిన్‌ ప్రజలను  మరింతగా  నిప్పుల కొలిమిలోకి తోస్తున్నాయి. బ్కెడెన్‌ సర్కారు తాజా నిర్ణయానికి స్పందనగా పుతిన్‌ అణ్వస్త్ర ప్రయోగానికి మార్గం సుగమం చేసేలా ఓ దస్త్రంపై సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగిన దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే.. దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు.

అదే సమయంలో కీవ్‌ దళాలు రష్యా ప్రధాన భూభాగంపై క్షిపణులతో దాడులు చేశాయి. దీనికి ప్రతీకారంగా మాస్కో దాడి చేయవొచ్చనే భయంతో కీవ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని ఖాళీ చేసింది. ఈ నేపథ్యంలోనే రష్యా  ఉక్రెయిన్‌పై సరికొత్త క్షిపణితో దాడి చేసింది. ఈ కొత్త బాలిస్టిక్‌ క్షిపణిని ఒరేష్నిక్‌ అని పిలుస్తున్నారు. ఇది హైపర్‌సోనిక్‌ విరీడియం రేంజ్‌ బాలిస్టిక్‌ మిసైల్‌.   ధ్వని వేగం కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో ఇది ప్రయాణిస్తుంది..దీనిని అడ్డుకోవటం దాదాపు అసాధ్యం. దీని రేంజ్‌ 5,000 కి.విరీ. ఇది యూరప్‌ తో పాటు  అమెరికా పశ్చిమ తీరాన్ని తాకగలదు. యున్కెటెడ్‌ స్టేట్స్‌, బ్రిటన్‌ తమ క్షిపణులతో రష్యా ప్రధాన భూభాగంపై దాడి చేయడానికి ఉక్రెయిన్‌ను అనుమతించటం ద్వారా ఈ యుద్ధం ప్రపంచ సంక్షోభానికి దారితీస్తోందన్నారు పుతిన్‌. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా పొరుగునున్న యూరప్‌ దేశాలు అప్రమత్తమయ్యాయి. చిన్న పిల్లల ఆహార పదార్థాలు, ఔషధాలు, తాగునీటిని నిల్వ చేసుకోవాలని కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సూచించాయి.

అయితే, అమెరికా కొత్త అధ్యక్షడు కొలువుదీరటానికి కేవలం కొన్ని వారాల ముందు బ్కెడెన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనుమానాలకు తావిస్తోంది. ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఉక్రెయిన్‌ పట్ల అమెరికా ప్రాధాన్యత తగ్గుతుంది. ఈలోగా, యుద్ధ తీవ్రతను మరింత పెంచి రష్యాపై ఒత్తిడి తేవాలనేది బ్కెడెన్‌ ప్రభుత్వం ప్లాన్‌ లా అనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిణామాలు యుద్దాన్ని ఎటువైపు తీసుకువెళతాయో ఎవరూ చెప్పలేరు. కొందరైతే, ఇప్పటికే మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని అంటున్నారు.  ప్రపంచం వాస్తవానికి మూడవ ప్రపంచ యుద్ధంలోకి అడుగుపెట్టిందని ఉక్రెయిన్‌ మిలటరీ మాజీ చీఫ్‌, బ్రిటన్‌ రాయబారి వలేరీ జులుజ్నీ ప్రకటించారు.

రష్యా ఉత్తర కొరియా దళాలను, ఇరాన్‌ ఆయుధాల వినియోగాన్ని జులుజ్ని ప్రత్యేకంగా ప్రస్తావించారాయన. ఉక్రెయిన్‌ యుద్ధం దాని ప్రాంతీయ సరిహద్దులను దాటిందని చెప్పారు. ఇక తన భద్రతకు నాటో నుంచి ముప్పు ఏర్పడినపుడు రష్యా అణ్వాయుధాను ఆశ్రయించటం అనివార్యం అవుతుంది. అమెరికా, పశ్చిమ దేశాలు పుతిన్‌ ను ఆ దిశగా నడిపిస్తున్నాయి. ఇప్పటికే రష్యా అణుదాడులకు సంసిద్ధమవుతోంది. అయితే ఇప్పటికిప్పుడు పుతిన్‌ అణు విరీట నొక్కుతాడని అనుకోలేము. రాబోవు రోజులలో ఉక్రెయిన్‌ దాడుల తీవ్రత, జరిగే నష్టంపై రష్యా స్పందన ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా… ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు తీవ్ర నష్టం మాత్రం  తప్పదు. అమెరికాతో శతృత్వం ప్రమాదకరం… కానీ అమెరికాతో  స్నేహం ప్రాణాంతకం..  అని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్‌ అన్న మాటలు  ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నాయి!!
 -ఎమ్‌.ఎస్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page