– ‘హడ్సన్’ ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: అమెరికా అనుసరించే విధానాలు, నిర్ణయాలు సానుకూల దృక్పథంతో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. అవి అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలను మరింత పెంపొందించేవిగా ఉండాలన్నారు. ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో భారత్‌లో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ తెలంగాణకు వచ్చిన అమెరికా హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 16 మంది ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం సమావేశమైంది. ఈ బృందంతో సీఎం తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవల అమెరికా పెంచిన రాయితీలు, వీసాలపై కఠిన నిబంధనలు భారత్‌కు ఆందోళన కలిగించాయని తెలిపారు. రెండు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాలోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రతినిధులు 16 మంది సీఎంతో సమావేశమయ్యారు. వివిధ రంగాలకు చెందిన మేధావులు, బిజినెస్ లీడర్లు ఈ బృందంలో ఉన్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





