హైదరాబాద్, జూన్ 11 : తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖ (Portfolios )లను కేటాయించారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన, మైనారిటీల సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, లింగమార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ శాఖలు కేటాయించారు. ఇక వాకిటి శ్రీహరికి పశుసంవర్ధకం, పాడి పరిశ్రమ అభివృద్ధి & మత్స్య సంపద, క్రీడలు& యువజన సేవల శాఖలు కేటాయిస్తూ ప్రకటన విడుదలైంది. వీరు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సెక్రటేరియట్ చాంబర్లు సైతం ఇప్పటికే సిద్ధమయ్యాయి.
- వాకిటి శ్రీహరి : పశుసంవర్థక, స్పోర్ట్ అండ్ యువజన సర్వీసులు శాఖ
- గడ్డం వివేక్: కార్మిక, మైనింగ్ శాఖలు
- అడ్లూరి లక్ష్మణ్ : ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ