అహ్మదాబాద్, జూన్ 12 : అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం (Air India Plane Crash ) చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం మేఘానిగర్‌లో కుప్ప కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా ఆకాశంలో నల్లటి పొగ పేరుకుపోయింది. చెట్టును తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 242 మంది ప్రయాణీకులు బోర్డింగ్ చేసినట్లు తెలిసింది. రెస్క్యూ టీమ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘానిననగర్ సమీపంలో కుప్పకూలిపోయింది. విమానాశ్రయం నుంచి ఇది దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన ఈ విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీం లైనర్ గా సమాచారం. ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటిక కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రయాణ సమయంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
హోంమంత్రి అమిత్ షా ఆరా
ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో మాట్లాడారు. ఇప్పటికే ఫోన్ చేసి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అయితే ఎయిర్ ఇండియా అధికారులు ఈ విమానం మధ్యాహ్నం 1: 17 గంటలకు టేక్ ఆఫ్ కాగా.. 1:50 గంటలకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అని చెప్పారు. మొత్తంగా ఈ విమాన ప్రయాణ సమయంలో 242 మంది ప్రయాణికులు 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లు ఉన్నట్లు సమాచారం. ఈ విమాన ప్రమాదంతో ఆ ప్రాంతాల్లో బంధువుల రోదనలు మిన్నంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ సంఖ్యలో మరణాలు సంభవించి ఉండొచ్చని వార్తలు కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.