
స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీఓలు) మరియు ప్రభుత్వాల పాత్రలు వేరు వేరుగా ఉంటాయి. ప్రభుత్వాల విధానాలు, మౌలిక సదుపాయాలు మరియు విస్తృత స్థాయి సంక్షేమ కార్యక్రమాలకు బాధ్యత వహిస్తాయి. ఇక ఎన్‌జీఓలు ప్రత్యేక సమస్యలపై దృష్టి పెట్టి, స్థానిక స్థాయిలో సేవలందించడంతో పాటు పౌరుల రాజ్యాంగ బద్ద హక్కుల గురించి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతుంటాయి. హక్కుల సాధనకు ప్రజాస్వామిక పద్దతుల ద్వారా ఉద్యమాలు నిర్మిస్తుంటారు. సంస్థలకున్న నైపుణ్యాలతో ప్రభుత్వానికి కొన్ని క్షేత్ర స్థాయి కార్యక్రమాల ద్వారా సాధ్యా సాధ్యాలను సమాజం దృష్టికి తీసుకువెళుతుంటారు. కానీ స్వచ్చంద సంస్థలు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కాదని గ్రహించాలి. మన రాష్ట్రంలో ఇలాంటి సంస్థలు వేలల్లో ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు అత్యాధునిక సాంకేతికతను అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వందేశంలోని 6 ప్రముఖ స్వచ్ఛంద సంస్థలుగా పేర్కొంటూ నందన్ నీలేకణి స్థాపించిన ఏక్ స్టెప్ సంస్థ, ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, ప్రజ్వల ఫౌండేషన్, పై జామ్ ఫౌండేషన్, మరియు ఎడ్యుకేట్ గర్ల్స్అనే సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మన రాష్ట్ర పాఠశాలల దుస్థితి కానీ, డిజిటల్ విద్యను అందుకునే పరిస్థితులను కానీ , వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను, గత పదేళ్ల నిర్లక్ష్యాన్నిపరిగణలో కి తీసుకున్నట్లు కనిపించడం లేదు. విద్యా ప్రమాణాలు ఈ ఒప్పందాలతో పూర్తిగా మారిపోతుందని ప్రభుత్వం అనుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సంక్షోభం నుండి విద్యా వ్యవస్థను బయట పడేయడానికి తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన ఇవ్వబోతున్న సిఫారసులను అమలు చేయాలనే ఆలోచన ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. మౌలిక సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, అసలు మూలకారణాలను దృష్టిలో పెట్టుకోకుండా కొత్త కొత్త ఆలోచనలు తీసుకురావడం బాధాకరం. సాంకేతిక పరిజ్ఞానం, ఇతర కొత్త మార్గాలు అవసరమే. కానీ అవి ప్రాథమిక విద్యకు ప్రత్యామ్నాయం కావు. తెలంగాణలో చాలా మంది పిల్లలు ఇప్పటికీ చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాల్లో వెనుకబడి ఉన్నారు. విద్యా వ్యవస్థలో మౌలిక లోపాలను తొలగించిన తరువాత మాత్రమే ఇతర చర్యలను పరిశీలించాలి.
సంక్షోభం లో పాఠశాల విద్య
జూన్ 12వ తేదీన తెరిచిన పాఠశాలలు ఎన్నో సమస్యలతో ప్రారంభం అయ్యాయి. ఈ సమస్య పట్ల తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మరియు కే టి దొడ్డి మండలాలలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో దాదాపు 200 పైగా టీచర్లు కావాలని తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు. ముఖ్యమంత్రికి వేల ఉత్తరాలు రాశారు. హైదరాబాదులోని 713 పాఠశాలల్లో 267 పాఠశాలలు అద్దె ఇండ్లళ్ళలో కమ్యూనిటీ హాళ్లలో నడుస్తున్నాయి. అద్దెలు చెల్లించని కారణంగా పాఠశాలలను ఖాలీ చేయాలని వత్తిళ్లు వస్తున్నాయి. రాష్ట్రంలో 5895పాఠశాలలను ఒకే టీచర్ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో 88429విద్యార్థులు నమోదై ఉన్నారు. ఈ ఒకే టీచర్ తో ఈ పాఠశాలల్లో నమోదైన విద్యార్థులకు బోధన జరగడం కష్టమైన పని. గురుకుల పాఠశాలలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి. వీటికీ అద్దె చెల్లింపుల సమస్య వుంది. అలాగే రాష్ట్రంలో తరగతి వారీగా అభ్యసనా సామర్ధ్యాలు అందించడంలో చాలా వెనుక బడి ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు లేక విద్యార్థులు విద్యకు దూరమౌతున్నారు. బడులకు వెళ్లాలంటే కష్టాలు తప్పడంలేదు. ఏళ్లకు ఏళ్లు మరమ్మతులు లేక పెచ్చులూడిపోతూ బడులు కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలికాయి. మన ఊరు మన బడి /బస్తీ పనులు బిల్లులు రాక సగంలో నే ఆగిపోయాయి.
జూన్ 12వ తేదీన తెరిచిన పాఠశాలలు ఎన్నో సమస్యలతో ప్రారంభం అయ్యాయి. ఈ సమస్య పట్ల తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మరియు కే టి దొడ్డి మండలాలలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో దాదాపు 200 పైగా టీచర్లు కావాలని తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు. ముఖ్యమంత్రికి వేల ఉత్తరాలు రాశారు. హైదరాబాదులోని 713 పాఠశాలల్లో 267 పాఠశాలలు అద్దె ఇండ్లళ్ళలో కమ్యూనిటీ హాళ్లలో నడుస్తున్నాయి. అద్దెలు చెల్లించని కారణంగా పాఠశాలలను ఖాలీ చేయాలని వత్తిళ్లు వస్తున్నాయి. రాష్ట్రంలో 5895 పాఠశాలలను ఒకే టీచర్ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో 88429 విద్యార్థులు నమోదై ఉన్నారు. ఈ ఒకే టీచర్ తో ఈ పాఠశాలల్లో నమోదైన విద్యార్థులకు బోధన జరగడం కష్టమైన పని. గురుకుల పాఠశాలలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి. వీటికీ అద్దె చెల్లింపుల సమస్య వుంది. అలాగే రాష్ట్రంలో తరగతి వారీగా అభ్యసనా సామర్ధ్యాలు అందించడంలో చాలా వెనకబడి ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు లేక విద్యార్థులు విద్యకు దూరమౌతున్నారు. బడులకు వెళ్లాలంటే కష్టాలు తప్పడంలేదు. ఏళ్లకు ఏళ్లు మరమ్మతులు లేక పెచ్చులూడిపోతూ బడులు కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలికాయి.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు చేపట్టిన పనులు పూర్తి కాని లేదు. చాలా పాఠశాలలో కాంట్రాక్టులకు బిల్లులు మంజూరు కానందున సగం లోనే పనులు ఆపేసిన స్కూల్ భవనాలు ప్రతి మండలంలో ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అవసరానికి మించి ఉపాధ్యాయులు ఉంటే మరికొన్ని పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది . ఈ స్థితిగతులు పై సామాజిక కార్యకర్తలతో పాటు తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో జిల్లా వారీ సమీక్షలు నిర్వహించాలి. గత రెండు మూడు సంవత్సరాలుగా పాఠశాల విద్యా కమిటీ ల ఏర్పాటు జరుగలేదు. వాటిని ఏర్పాటు చేయాలి
సాంకేతిక నైపుణ్యాలు లేదా కృత్రిమ మేధస్సు , స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) శిక్షణలు అందుకోవడానికి ముందుగా విద్యార్థులందరికి రాయడం చదవడం కనీస స్థాయి లెక్కలు చేయడం రావాలి. అప్పుడు మాత్రమే స్వచ్చంద సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల లక్ష్యం నెరవేరుతుంది. ముఖ్యంగా టీచర్ల అనుభవాలను వారి ఆలోచనలను ఈ మొత్తం ప్రక్రియలో పరిగణంలోకి తీసుకోవాలి. ఎంత మంచి ఉద్దేశంతో మొదలు పెట్టినా అంతిమంగా టీచర్ల నైపుణ్యాలు, వారి సంసిద్దత చాలా అవసరమని గుర్తించాలి. ఈ క్రింది కార్యాచరణ చేపడితేనే ఆయా స్వచ్ఛంద సంస్థలు రూపొందించే అత్యాధునిక బోధన సాధ్యమవుతుంది.
ముందుగా విద్యార్థుల నమోదు ఎక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించాలి. ఈ ఈ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసి శిక్షణ పొందిన టీచర్లను నియమించాలి. విద్యార్థులకు అభ్యసనా సామర్ధ్యాలు అందిస్తామని హామీ నివ్వాలి. ఇందుకోసం పెంచడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. ప్రతి నెల రాష్ట్ర జిల్లా మండల మరియు క్లస్టర్ స్థాయిలో కేవలం తరగతి వారీ అభ్యసనా సామర్ధ్యాల పురోగతి మీద సమీక్షలు నిర్వహించాలీ. పట్టణ ప్రాంతానికి వార్డు ఒక యూనిట్ గా తీసుకొని అక్కడి పిల్లల జనాభాను పాఠశాలలను అందుబాటులోకి తేవాలి. మండలం లేదా పట్టణ వార్డు ఒక యూనిట్ గా తీసుకుని అవసరమయిన ప్రణాళికలు వేయాలి. వెంటనే పాఠశాల విద్య కమిటీలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆవిధంగా తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచాలి. ప్రైవేటు విద్యను నియంత్రించడానికి స్వయంప్రతిపత్తి గల కమిషన్ నునియమించాలి.
చివరగా రాష్ట్రంలో విద్యా ఎమర్జెన్సీ ఉందని గుర్తించాలి. యుద్ద ప్రాతిపదికంగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. కేవలం అధికారుల నివేదికలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి స్థితిగతులను అంచనా వేయాలి. విద్యా కమిషన్ చేసిన సూచనలకు అనుగుణంగా విధానాలు రూపొందించాలి. రోజుకో కొత్త ఆలోచనలు కొత్త విధానాలు శాశ్వత పరిష్కారాలు చూపించవు. గాడితప్పిన విద్యా వ్యవస్థను సరైన దారిలో పెట్టకుండా ఎంత గొప్ప నైపుణ్యం గల సంస్థలు వచ్చినా ఫలితాలు ఆశించినంతగా కనపడవని గమనించాలి. ముఖ్యమంత్రిగా మరియు విద్యా శాఖ మంత్రి గా కొన్ని పాఠశాలకు లేదా కొంత మంది విద్యార్థులనే దృష్టిలో పెట్టుకోని విధానాలు రూపొందించ కుండా రాష్ట్రంలో చదువుకు కదిలిన విద్యార్థులందరికి నాణ్యమైన అధునాతన సాంకేతిక విద్య ను అందించాలనే రాజకీయ సంకల్పం అవసరం.

జాతీయ కన్వీనర్, ఎం. వి. ఫౌండేషన్)