జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం

– త్వరలో అక్రిడిటేషన్‌ పాలసీ రూపకల్పన
– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత్రికేయుల కోసం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన జర్నలిస్టులకు అందేలా విధివిధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాసరెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ సిహెచ్‌.ప్రియాంక, సిపిఆర్‌వో మల్సూర్‌తో కలిసి అక్రిడిటేషన్‌ పాలసీపై బుధవార సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడేవిధంగా శాస్త్రీయ పద్దతిలో అక్రిడిటేషన్‌ పాలసీ ఉండాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా అక్రిడిటేషన్‌ కార్డులను జారీ చేయడానికి ఈనెల చివరినాటికి పాలసీ విధివిధానాలను కొలిక్కి తీసుకురావాలని ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page