రాజకీయ ప్రయోజాల కోసమే ఇడి కేసులు

  • బీజేపీ విద్వేష భావజాలాన్ని తిప్పికొట్టాల్సిందే
  • కుట్రలు బయటపడతాయనే భయంతోనే కేసులు
  • నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రికతో బండారం బయట పడుతుందన్న భయం
  • కాంగ్రెస్‌కు ప్రజల ఆదరణ పెరగడంతో మోడీ ద్వయం కుట్రరాజకీయాలు
  • ఇడి కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ‌ధర్నాలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌, ‌సిఎల్‌పి నేత భట్టిల విమర్శ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్‌ ‌గాంధీ, సోనియా గాంధీలపై ఈడీతో కేసులు పెట్టిస్తున్నారని టీపీపీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే 14 ఏళ్ల తర్వాత ఈ కేసులను మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు. అయితే ఈ కుట్రలను కాంగ్రెస్‌ ‌తిప్పికొట్టి మళ్లీ అధికారంలోకి వొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈడీ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీ కాంగ్రెస్‌ ‌హైదరాబాద్‌ ఈడీ ఆఫీస్‌ ఎదుట చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్‌..‌బీజేపీ విద్వేష భావజాలాన్ని తిప్పికొట్టి ప్రజా సమస్యలను బయటపెట్టేందుకే నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రికను తిరిగి ప్రారంభించారని చెప్పారు. అయితే ఈ పత్రిక ద్వారా తమ కుట్రలు బయటపడతాయనే భయంతోనే ఈడీతో కేసులు పెట్టించారని రేవంత్‌ ‌విమర్శించారు. దేశభక్తిని పెంపొందించడానికి నేషనల్‌ ‌హెరాల్డ్‌ను నడిపించారని రేవంత్‌ ‌చెప్పారు. ఉద్యోగుల జీతాల కోసం 90 కోట్ల పెట్టుబడులు పెట్టారని..లాభాల కోసం నేషనల్‌ ‌హెరాల్డ్, ‌యంగ్‌ ఇం‌డియా సంస్థలు పనిచేయవని తెలిపారు. డబ్బులు చేతులు మారలేదు కాబట్టి ఆర్థికనేరం కింద విచారణ చేయడానికి వీల్లేదని ఈడీ గతంలోనే చెప్పిందని..అయితే కాంగ్రెస్‌ ‌ప్రజలకు దగ్గర అవుతుందనే ఉద్దేశ్యంతో మళ్లీ ఈడీ కేసులు పెట్టి సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీలను వేధిస్తున్నారని రేవంత్‌ ‌మండిపడ్డారు. మోడీ, అమిత్‌ ‌షా రాక్షసంగా వ్యవహరిస్తున్నారని రేవంత్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. తల్లి ఆరోగ్యం బాగోలేని సమయంలో రాహుల్‌ ‌ను విచారణ పేరుతో అర్థరాత్రి వరకు ఈడీ ఆఫీసులోనే ఉంచడం మోడీ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.

ప్రజలు బీజేపీ కుట్రలను గమనిస్తున్నారని..వొచ్చే ఎన్నికల్లో వారే ఆ పార్టీకి తగిన సమాధానం చెప్తారని అన్నారు. దేశ చరిత్రలో ఇంత బరితెగించిన ప్రధానిని ఎప్పుడు చూడలేదని.. దేశం కోసం ప్రాణాలను ఇచ్చిన కుటుంబాలను అవమానిస్తున్నారని అన్నారు. ఇదిలావుంటే బ్యాంకులను లూటీ చేసిన నేతలంతా బిజెపిలోనే ఉన్నారనికాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డిలు ఆరోపించారు. రాహుల్‌ ఈడీ విచారణపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సోనియా, రాహుల్‌ ‌గాంధీలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. నేషనల్‌ ‌హెరాల్డ్‌కు సంబంధించిన ఆస్తుల్లో ఒక్క రూపాయి కూడా తీసుకునే హక్కు ట్రస్టు వాళ్లకు లేదని కాంగ్రెస్‌ ‌నేతలు అన్నారు. నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ వరుసగా రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు.. ‘కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన చరిత్ర వాళ్లది. రాహుల్‌ ‌గాంధీ ఈడీ విచారణ దఅష్ట్యా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం.

గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. అలాంటి వారు భాజపాలో ఎవరైనా ఉన్నారా? బ్యాంకులను లూటీ చేసిన నేతలంతా బిజెపిలోనే ఉన్నారు’ అని కాంగ్రెస్‌ ‌నేతలు మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసే కుట్ర జరుపుతుందని పేర్కొన్నారు. అందుకే ఈడీ కేసుల ప్రయోగమని తెలిపారు. నెహ్రూ 16, ఇందిరా 6 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపారన్నారు. దేశం కోసం గాంధీల కుటుంబాన్ని త్యాగం చేశారన్నారు. మరి బీజేపీలో దేశం కోసం ఒక్కరైనా త్యాగం చేసినవారు ఉన్నారా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. స్వాతంత్య ్రఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బ్రిటీష్‌కి వత్తాసు పలికిందన్నారు. గాంధీని చంపిన గాడ్సేని బీజేపీ నేత ఒకరు పార్లమెంట్‌లో గొప్పవాడు అంటున్నారన్నారు. బ్యాంకులు లూటీ చేసిన నేతలంతా బీజేపీలో ఉన్నారన్నారు. వారి వి•ద ఈడీ ఉండదా..? అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబానికి తామంతా అండగా ఉంటామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి భయం పుట్టినప్పుడల్లా గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ‌మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీలదన్నారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. ముంబై ఎయిర్పోర్టును ఆదానికి అప్పగించడానికి సీబీఐని ఉపయోగించు కున్నారా? లేదా..? అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకులను బీజేపీ… సీబీఐ, ఈడీతో అణిచివేసే ప్రయత్నం చేస్తోందని పొన్నం ప్రభాకర్‌ ‌తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *