రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని పాఠశాలల ఖాతాల్లో నిల్వ ఉన్న నిధులను విద్యాశాఖ వెనక్కి తీసు కోవ డంతో ప్రధానో పాధ్యా యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వున్నారు. కొన్ని సంవత్స రాలుగా పాఠశాలల ఖాతాల్లో ఉన్న నిధులను గత విద్యా సంవత్సరం మార్చి, ఏప్రిల్ చివరిలో విద్యాశాఖ వాపసు తీసుకుంది. వీటిని వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో వెనక్కు పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యాశాఖ అధికారులు రూ. వందల కోట్ల నిధులు వాపసు చేశారు. అధిక ప్రభుత్వ పాఠశాలల్లో సంబందిత నిధులు నిరుపయోగంగా ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనీ తెలుస్తోంది. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు అవుతున్నా నిధుల కేటాయింపు విషయంపై స్పష్టత రాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు బడి నిర్వహణపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అన్ని జిల్లాలలో వేలాది ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలున్నాయి.
ఇందులో ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బడుల నిర్వహణకు ప్రతి యేటా రెండు విడతల్లో ప్రభుత్వం గ్రాంటు మంజూరు చేస్తుంది. అన్ని జిల్లా లలో రెండు సంవత్సరాలకు సంబంధిం చిన నిధులు వినియోగించని పాఠశాలలకు గ్రాంటు మొత్తాలు ఖాతాలో పడి ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. బ్యాంకుల్లో నిల్వ ఉన్న నగదు మొత్తానికి వడ్డీ కూడా జమ చేస్తారు. ఈ లెక్కన అన్ని జిల్లాల లోని అన్ని పాఠశాలలకు కలిపి రూ.వందల కోట్లు ఉన్నట్లు సమగ్ర శిక్ష అధికారులు గుర్తించారు.. ఏళ్లుగా. నిధులు ఉన్నా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా అధిక పాఠశాలలో వినియోగానికి నోచుకోలేదు. కొన్ని చోట్ల ప్రధానోపాద్యాయులు, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లు, సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయనీ ఆరోపణలు వినవస్తున్నాయి..
ప్రభుత్వం ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న పాఠశాలలకు గ్రాంటు విడుదల చేస్తుంది. ఒకటి నుంచి 30లోపు విద్యార్థులున్న పాఠశాలలకు రూ. 12,500, 31 నుంచి 250 వరకు ఉన్న ఉన్న పాఠశాలలకు రూ. 25 వేలు, 251 నుంచి 500 వరకు ఉన్న పాఠశాలలకు రూ. 50 వేలు, 501 నుంచి 750 వరకు ఉన్న పాఠశాలలకు రూ. 75 వేలు, 751కి పైబడి విద్యా ర్థులున్న పాఠశాలలకు రూ. లక్ష చొప్పున ప్రభుత్వం గ్రాంటు విడుదల చేస్తుంది. ప్రతి విద్యా సంవత్సరం నవంబరు మాసంలో మొదటి విడత, మార్చి మాసంలో రెండవ విడత గ్రాంటు మంజూరు అవుతుంది. ప్రభుత్వం ప్రతి యేడాది విడుదల చేసిన గ్రాంటును వినియోగించు కోవడానికి అవసరమైన మార్గదర్శకాలను సూచించింది. ప్రధానో పాధ్యాయులు పాఠశాలకు అవసరమైన చాక్పీసులు, డస్టర్లు, రిజిస్టర్లు, పుస్తకాలు, మధ్యాన్న భోజనం లెక్కల జిరాక్షులు రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవం, ఇతర జాతీయ దినోత్సవాల సందర్భంగా ఉత్సవాలు నిర్వహణకు, పాఠశాలకు అవసరమైన సంద ర్భాల్లో సున్న వేయడం, చిన్న చిన్న మరమ్మతులకు సంబందిత గ్రాంటు నుంచి నిధులు వినియోగించుకునే అవకాశాలున్నాయి. 2022-2023 విద్యా సంవత్సరానికి పాఠశాల గ్రాంటు సాధారణంగా ప్రతి ఏడాది నవంబర్లో మొదటి విడత, మార్చిలో రెండో విడత ఇస్తారు.
విద్యా సంవత్సరం చివర్లో నిధులు విడుదల చేయడంతో కొన్ని పాఠశా లల్లో ఖర్చు చేయలేకపోతున్నారు. నిధులు వచ్చిన తర్వాత తీసుకోవచ్చులే అని ముందుగా ప్రధానోపాద్యాయులు సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. నిధులు వచ్చిన తర్వాత వాటిని తీసుకోవాలని అనుకుంటే కొందరు ఎస్ఎంసీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాఠశాల నిర్వహణకు అవసరమైన నిధుల వ్యయం ప్రధానోపాధ్యాయులకు కష్టతరంగా మారుతోంది. దీనికి తోడు ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో గల పాఠశాల గ్రాంటు నిర్వహణ బ్యాంకు ఖాతాలను ప్రధానోపాధ్యా యులు, ఎస్ఎంసీ చైర్మన్లు రద్దు చేసుకున్నారు. కొత్త ఖాతాలను తెరవడానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. దీంతో కొత్త ఖాతాలు సైతం తెరుచుకోవడం లేదు. ప్రభుత్వం ఖాతాల తెరవడానికి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. పాఠశాల నిర్వహణ గ్రాంటు ఎప్పుడు విడుదల అవుతుందోనని ప్రధానోపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు అవసరమైన గ్రాంటు సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి.
గ్రాంటు లేకపోవడం వల్ల ప్రధానోపాధ్యా యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. చిన్న చిన్న సమస్యలకు నిధుల వ్యయం తలనొప్పిగా తయారయింది.. ప్రస్తుత విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం గ్రాంటు మంజూరు చేయలేదు.అనేక జిల్లా లోని పాఠశాల్లో గత ఏడాది కెనరా బ్యాంక్ లో ప్రధానో•ధ్యాయులు, యస్, యం.సి ఛైర్మన్ తో సంయుక్తగా ఖాతా తెరవడానికి ఫొటోస్, అప్లికేషను కాగితాలు సమర్పించారు.ఇంత వరకు ఖాతా పుస్తకాలు రాలేదు.ఇప్పటికే పలు రకాల జిరాక్స్ ల మీద చాలా డబ్బులు ఖర్చు అవుతూ వున్నాయి.వానిని ఆయా పాటశాలల ప్రధానోపాధ్యాయులు జేబుల నుండి స్వంత డబ్బులు కర్చు పెడుతూ వున్నారు.ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో బ్యాంక్ అకౌంట్ తెరచి వారి అకౌంట్ లో డబ్బులు జమ చేయాలి
– కామిడి సతీష్ రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా.
.9848445134.




