ఏకగ్రీవంగా ఆమోదించండి : ప్రధాని మోదీ
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 19 : మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీన్ని ఉభయ సభల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కొత్త పార్లమెంట్ భవనంలో ప్రసంగించిన మోదీ..ఈ బిల్లుకు కేబినెట్ భేటీలో ఆమోదం లభించిందని.. ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో ఎక్కువ మంది మహిళలు భాగస్వామ్యం కావాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందని అన్నారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ధి పక్రియను ప్రపంచం గుర్తించిందని.. క్రీడల నుంచి స్టార్టప్‌ల వరకు మహిళలు అందించిన సహకారాన్ని చూస్తుందని తెలిపారు. ఈ బిల్లుపై చాలా ఏళ్లుగా వాదనలు జరిగాయని..1966లో మొదటి సారి ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఆ తర్వాత వాజ్‌పేయీ హయాంలోనూ ఈ బిల్లు ప్రస్తావన వొచ్చినా..అప్పుడు ఆ కల నెరవేరలేదని తెలిపారు.




