తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బంగాళాఖాతంలో ముంచుడు ఖాయం

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి విశ్వాసం లేదు
•నిరుద్యోగ యువత, రైతాంగం, మహిళలు బీజేపీ వైపే మొగ్గు
•రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం  తథ్యం
•దిల్లీలో మీడియాతో ఈటల రాజేందర్‌

‌న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 01 :  ‌వ్యక్తులు అటు ఇటు మారుతూ ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం నిశ్చి తాభిప్రాయ ంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్‌ ‌మళ్ళీ అధికారంలోకి రావద్దు.. మళ్లీ కెసిఆర్‌ అధికారంలోకి వస్తే ప్రజలు బ్రతికి బట్టి బట్టకట్టరు.. అనే అభిప్రాయంతో ఉన్నారని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌పేర్కొన్నారు. బుధవారం ఆయన న్యూదిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అనేక సంవత్స రాలుగా అనేక విషయాల మీద అదరగొట్టిన కేసీఆర్‌ ‌కాళేశ్వ రం మీద సమాధానం చెప్పడం లేదు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్ల విషయంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఎలా మోసం చేశారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.  కచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈసారి ఆ పార్టీని, కేసీఆర్‌ ‌ను  బంగాళాఖాతంలో ముంచుడు ఖాయం అన్నారు.  చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ ‌పార్టీని లేపే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ గత చరిత్ర అంతా కూడా కళ్ళ ముందు కదలాడుతుంది. ఇదేం కొత్త పార్టీ కాదు. ఇవాళ కొంతమంది చేరుతున్నప్పుడు కొంత పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.. కానీ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి విశ్వాసం లేదు. 2014లో కౌన్సిల్లో ఉన్న సభ్యులందరూ టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు.2018లో 19 మంది శాసనసభ్యులు కాంగ్రెస్‌ ‌నుంచి గెలిస్తే 12 మంది శాసనసభ్యులు మేము పార్టీని రద్దు చేసుకుం టున్నాం..

మెర్జ్ ‌చేసుకుంటున్నమని ప్రకటించి..కాంగ్రెస్‌ ‌పార్టీని గెలిపిస్తే టీఆర్‌ఎస్లో కలిపేసిన చరిత్ర చూస్తూ ఉన్నారు. కాబట్టి టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఓటు వేసిన కాంగ్రెస్‌ ‌పార్టీకి ఓటు వేసిన మనం వద్దనుకుంటున్న కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రిగా గద్దెనెక్కేఅవకాశం ఉంది. కాబట్టి బరికేసి కొట్లాడే, మంచి పరిపాలన అందించే శక్తి సత్తా.. భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది.  నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎట్లా పురోగమిస్తుందో చూస్తున్నాం. తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే.. నరేంద్ర మోదీ అండదండలు ఉంటేనే.. కేంద్ర సర్కారు సపోర్ట్ ఉం‌టేనే సాధ్యమవుతుంది అని భావిస్తున్నామని చెప్పారు.  ఎవరికి ఎన్ని రాతలు రాసిన.. ఎవరు ఎన్ని కథనాలు వేసినా నూటికి నూరు శాతం  తెలంగాణ ప్రజలు, నిరుద్యోగ యువత, రైతాంగం, మహిళలు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని భావనతో ఉన్నారు.  ఇందులో భాగంగానే గ్రామాలకు పోతున్నప్పుడు బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. అనేకమంది కాంగ్రెస్‌ ‌నుండి, బిఆర్‌ఎస్‌ ‌నుండి చేరుతున్నారు. బిఆర్‌ఎస్‌  ‌పార్టీ నాయకులు ఏ ఊరికి వెళ్లిన కూడా నిరసన సెగలు తగులుతున్నాయి.  తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని విశ్వాసంతో ముందుకు పోతున్నామని ఈటల రాజేందర్‌ ‌ధీమాని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *